News November 19, 2025
మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదకద్రవ్యాల వాడకం నియంత్రణ, శాఖలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన పెంపు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
Similar News
News March 18, 2026
పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు ఉగాది కానుక

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గంలో చాలా గ్రామాలు ముంపుకు గురవుతున్న విషయం తెలిసిందే. నిర్వాసితులకు బుధవారం ఉగాది కానుకగా 3వ విడత ఆర్ అండ్ ఆర్ నష్టపరిహారం రూ. 250 కోట్ల చెక్కును అమరావతిలో సీఎం చంద్రబాబు అందించారు. పోలవరం జిల్లాలోని చింతూరు డివిజన్‌లో నిర్వాసితులను ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి అమరావతి తీసుకువెళ్లి వారికి సీఎం చేతుల మీదుగా చెక్కులు అందజేశారు.
News March 18, 2026
విజయవాడలో వేడుకల కోసం వెండి రథం

ఉగాది పండగ, వసంతోత్సవాల కోసం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో వెండి రథం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. తెలుగు నూతన సంవత్సరం గురువారం ప్రారంభం కానున్నట్లు అర్చకులు తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వెండి రథ ఊరేగింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేపడుతున్నామన్నారు.
News March 18, 2026
దివ్యాంగ చిన్నారులతో విశాఖ కలెక్టర్ ఆత్మీయ విందు

విశాఖలోని వివిధ వసతి గృహాలకు చెందిన దివ్యాంగ చిన్నారులతో కలిసి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆత్మీయ విందు నిర్వహించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు.


