News November 19, 2025
కుండలేశ్వర పుణ్యక్షేత్రంలో విషాదం

కాట్రేనికోన మండలం కుండలేశ్వరం శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి దర్శనానికి వచ్చిన బొట్టా నిర్మల (67) గుండెపోటుతో మృతిచెందారు. భక్తురాలు నిర్మల స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయం బయట కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా ఆకస్మికంగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
Similar News
News March 11, 2026
వికారాబాద్: ‘పది’ పరీక్షలు.. ఇదిగో వివరాలు..!

జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 13,514 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు జిల్లా విద్యాధికారి- డీఈవో రేణుకాదేవి తెలిపారు. వికారాబాద్ జిల్లాలో పరీక్షల నిర్వహణకు 69 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. 13,514 మంది విద్యార్థుల్లో- బాలురు- 6,740 మంది, బాలికలు- 6,774 మంది ఉన్నారన్నారు. 824 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఐదు ప్రత్యేక బృందాలను ఈ సందర్భంగా ఏర్పాటు చేశామన్నారు.
News March 11, 2026
ఒంటిమిట్ట: మార్చి 25న పసుపు దంచే కార్యక్రమం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 25న ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి 27న ప్రారంభం కానున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో ఈ పసుపును వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళల అధిక సంఖ్యలో పాల్గొంటారు.
News March 11, 2026
VKB: అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలి: కలెక్టర్

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ కోరారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో 99రోజుల ప్రగతి ప్రణాళికపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజాపాలన కార్యక్రమాలను నిర్వహించి అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.


