News November 19, 2025
3.11 లక్షల మహిళలకు ఇందిరమ్మ చీరలు: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ పండుగ వాతావరణంలో జరగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. 18 ఏళ్లు పైబడిన 3,11,922 మంది మహిళలు చీరలకు అర్హులని తెలిపారు. వివాదాలకు తావు లేకుండా ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, దీని కోసం ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించామని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News March 20, 2026
నేడే రాష్ట్ర బడ్జెట్

TG: 2026-27 రాష్ట్ర బడ్జెట్‌కు వేళయింది. ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీలో DyCM భట్టి, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో క్యాబినెట్ సమావేశమై బడ్జెట్‌ను ఆమోదించనుంది. ఈ ఏడాది బడ్జెట్ ₹3.36 లక్షల కోట్లుగా ఉండనుందని తెలుస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఉంటుందని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹29 వేల కోట్లు కేటాయించవచ్చని సమాచారం.
News March 20, 2026
భారీ ఆఫర్‌ను తిరస్కరించిన రాజస్థాన్ రాయల్స్?

IPL జట్టు రాజస్థాన్ రాయల్స్ భారీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. కొలంబియా పసిఫిక్ క్యాపిటల్ పార్ట్‌నర్స్(CPCP) కన్సార్షియం వేసిన $1.7 బిలియన్ల(₹16 వేల కోట్లు) బిడ్‌ను ఫ్రాంచైజీ అంగీకరించలేదని NDTV తెలిపింది. మరింత వాల్యుయేషన్ కోసమే RR ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. RCBని కొనుగోలు చేసేందుకు స్వీడన్ కంపెనీ ‘ఈక్యూటీ(EQT)’ ₹18,486 కోట్లకు బిడ్ దాఖలు చేసినట్లు <<19422000>>వార్తలు రావడం<<>> తెలిసిందే.
News March 20, 2026
విశాఖ ఉమ్మడి జిల్లాకు ఒకే ఏటీఎస్

విశాఖ ఉమ్మడి జిల్లాల వాహనదారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. సబ్బవరం (M) దేవీపురంలో ఉన్న ఒకే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ వద్ద రోజూ వాహనాలు బారులు తీరుతున్నాయి. ఎనిమిదేళ్ల లోపు వాహనాలకు రెండేళ్లకు ఒకసారి, ఆపై ప్రతి ఏడాది ఫిట్నెస్ పరీక్ష తప్పనిసరి కావడంతో ఒత్తిడి పెరిగింది. ఆయితే ఉమ్మడి జిల్లాలో మరోక సెంటర్ ఏర్పాటు చెయాలన్న ప్రతిపాదన ఇంకా కార్యరూపం దాల్చలేదు.


