News November 19, 2025
చెర్వుగట్టులో మార్పు మొదలు

తెలంగాణలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రం, తెలంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతున్న చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మార్పులు మొదలయ్యాయి. ప్రతి గురువారం మన గుడి.. స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమానికి ఈవో సాల్వాది మోహన్ బాబు శ్రీకారం చుట్టారు. ఆలయంలో చెత్త ఇక నుంచి ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఈవో దృష్టి సారించారు. పవిత్రమైన పుష్కరిణిని భక్తులు అపవిత్రం చేయకుండా సహకరించాలని ఆయన కోరారు.
Similar News
News March 21, 2026
జనగామ: కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. చిగురిస్తున్న ఆశలు!

గత ప్రభుత్వంలో కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి నాలుగేళ్లుగా పింఛన్లు రాక నానా అవస్థలు పడ్డారు. జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు ఇప్పించండి మహాప్రభో అని ప్రజావాణిలో వేడుకున్నారు. ఎట్టకేలకు శుక్రవారం శాసనసభలో భట్టి విక్రమార్క కొత్త పింఛన్లకు బడ్జెట్ కేటాయించడంతో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జనగామ జిల్లాలో సుమారుగా 10 వేల కొత్త పింఛన్లు రావాల్సి ఉంది.
News March 21, 2026
భారీగా పెరిగిన చికెన్ ధరలు!

రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. నిన్నటి వరకు కేజీ రూ.330 వరకు విక్రయాలు జరిగాయి. ఇవాళ ఆ ధర భారీగా పెరిగి రూ.400కు చేరింది. విజయవాడలో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.380-రూ.400 వరకు అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో రూ.340-350 వరకు విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రతకు ఉత్పత్తి తగ్గడమూ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మీ ప్రాంతంలో చికెన్ రేట్ ఎంత ఉంది?
News March 21, 2026
మహాత్మాగాంధీ యూనివర్సిటీకి రూ.25 కోట్లే!

Dy.CM భట్టి బడ్జెట్ ప్రసంగంలో MGUలో నూతనంగా LAW, ఫార్మసీ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ నిధుల కేటాయింపుల విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా వ్యవహరించింది. ఈ బడ్జెట్‌లో వర్సిటీకి కేవలం రూ. 25 కోట్లను మంజూరు చేసింది. ఈ అరకొర నిధులతో కొత్త కాలేజీలు ఎలా వస్తాయని, వర్సిటీ అభివృద్ధి ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మిగులుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


