News November 19, 2025

HYD: 18 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

image

నవంబర్ 12 నుంచి 18వరకు జరిగిన ఆపరేషన్‌లో 11కేసులను ఛేదించి దేశ వ్యాప్తంగా 18మందిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ట్రేడింగ్ మోసాలను కట్టడి చేస్తూ 15మందిని పట్టుకున్నారు. హెటెరో కంపెనీపై 250 మిలియన్ డాలర్ల భారీ ఎక్స్‌టోర్షన్‌కు ప్రయత్నం చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నకిలీ మెయిల్స్, ఫేక్ USFDA డాక్యూమెంట్లతో గ్యాంగ్ బెదిరించిందన్నారు.

Similar News

News March 18, 2026

సూర్యాపేట: ఎక్కడ పర్యటన ఉన్నా.. ముందుగా బడికే!

image

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని 23 మండలాల్లో ఆయన ఏ పర్యటనకు వెళ్లినా ముందుగా స్థానిక బడులను పరిశీలిస్తున్నారు. నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటిస్తూ విద్యా ప్రమాణాలను అంచనా వేస్తున్నారు. బోధనలో నాణ్యత పెంచేలా టీచర్లకు సూచనలు ఇస్తున్నారు. కలెక్టర్ పనితీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

News March 18, 2026

బుద్ధవనం.. పర్యాటకులకు ఆకర్షణ కేంద్రం

image

నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనం బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. బుద్ధుడి జీవితం, బోధనలు, జాతక కథలను ప్రతిబింబించే శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రశాంత వాతావరణం, ధ్యానానికి అనువైన ప్రదేశాలతో పాటు థీమ్ పార్కులు, మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

News March 18, 2026

బాపట్ల: ‘నేర నియంత్రణ లక్ష్యంగా పనిచేయాలి’

image

నేర నియంత్రణ లక్ష్యంగా పోలీసు అధికారులు పనిచేయాలని జిల్లా SP ఉమామహేశ్వర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో గంజాయి డ్రగ్స్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేయాలన్నారు.