News November 19, 2025

NRPT: చీరల పంపిణీ విజయవంతంగా నిర్వహించాలి

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో “మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి” పేరిట” ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి మంత్రులతో కలిసి చీరల పంపిణీ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇందిరా మహిళ శక్తి చీరలు ఇవ్వాలని సూచించారు.

Similar News

News March 20, 2026

అకాల వర్షాలు.. రూ.62 కోట్ల నష్టం

image

AP: అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. 12 జిల్లాల్లో మొక్కజొన్న, వరి, మినపకు రూ.40 కోట్ల మేర నష్టం జరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు. మరో 9 జిల్లాల్లో అరటి, బొప్పాయి, మిరపకు, 9 జిల్లాల్లో మామిడి, బత్తాయి, నిమ్మకు రూ.22.68 కోట్ల నష్టం(మొత్తం రూ.62.68 కోట్లు) వాటిల్లినట్లు వెల్లడించారు. రైతులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని CBN ఆదేశించారు.

News March 20, 2026

విజయవాడ: స్కానింగ్‌తో వివరాల ప్రత్యక్షం

image

విజయవాడలో ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నగరంలో నడిచే అన్ని ఆటోలకు క్యూఆర్ కోడ్ తప్పనిసరి చేయనున్నట్లు డీసీపీ షరీనా బేగం వెల్లడించారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఆటో డ్రైవర్ వివరాలు, లైసెన్స్ వివరాలు తదితర సమాచారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్నారు. ఆటో డ్రైవర్లు ఇబ్బంది కలిగిస్తే 112 కు ఫిర్యాదు చేయాలన్నారు.

News March 20, 2026

సీక్వెల్స్‌లో మీకు నచ్చిన సినిమా ఏంటి?

image

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తోంది. సూపర్ హిట్ అయిన చిత్రాలకు కొనసాగింపుగా సినిమాలు తీయడం పెరుగుతోంది. ఈ జాబితాలో బాహుబలి, KGF, పుష్ప, కాంతార(ప్రీక్వెల్), డీజే టిల్లు, అఖండ, కార్తికేయ, ఇస్మార్ట్ శంకర్, దృశ్యం, F2, పొన్నియన్ సెల్వన్, హిట్, పొలిమేర, మత్తు వదలరా, మ్యాడ్, తాజాగా ధురంధర్ సినిమాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన సీక్వెల్ ఏంటో కామెంట్ చేయండి.