News November 19, 2025

భూ బాధితులకు ఉద్యోగాలు తప్పనిసరి: ఎంపీ కావ్య

image

కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి పరిశీలించారు. యూనిట్ పనుల్లో జాప్యం లేకుండా చూడాలని, భూములు కోల్పోయిన స్థానికులకు ఉద్యోగాలు తప్పనిసరిగా కల్పించాలని ఆమె సూచించారు. ఉద్యోగాల అంశంపై గతంలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసినట్లు గుర్తుచేస్తూ, పార్లమెంట్‌లో కూడా గళం వినిపిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

Similar News

News March 5, 2026

ఫైనల్‌కు ఒక్క అడుగుదూరంలో..

image

T20WC: నేడు ముంబై వేదికగా భారత్ ఇంగ్లండ్‌తో సెమీస్‌లో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో వరుసగా మూడోసారి ఇంగ్లండ్‌తో ఆడనుంది. 2022లో ఇంగ్లండ్, 2024లో భారత్ సెమీస్ విజేతలుగా నిలిచాయి. ఇక హెడ్ టు హెడ్‌లో భారత్‌దే పైచేయి. T20WC చరిత్రలో ఐదుసార్లు తలపడగా IND మూడుసార్లు గెలిచింది. 2024 మ్యాజిక్‌ను రిపీట్ చేసి మళ్లీ ఫైనల్ చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాత్రి.7.00కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

News March 5, 2026

నేడు షా సమక్షంలో నితీశ్ నామినేషన్?

image

బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేడు కేంద్రహోంమంత్రి అమిత్ షా సమక్షంలో రాజ్యసభ నామినేషన్ వేసే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈరోజు NDA శ్రేణులతో భేటీకి షా బిహార్ రానున్నారు. ఈ సందర్భంగా BJP చీఫ్ నితిన్ నబీన్‌తో పాటు నితీశ్ కూడా షా సమక్షంలో నామినేషన్‌ వేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే జేడీయూలో ఓ వర్గం ఇందుకు సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో బిహార్ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

News March 5, 2026

మిల్లెట్ మహిమ: 106 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా లక్ష్మమ్మ

image

నేటి కల్తీ ఆహారపు విషవలయంలో మానవుడి సగటు ఆయువు 70ఏళ్లకే పరిమితమవుతుంటే, నంద్యాల(D) పాములపాడు మండలం చెలిమిళ్లకు చెందిన లక్ష్మమ్మ 106 ఏళ్లు పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వయసులోనూ ఆమె చూపు మందగించకపోవడం, తన పనులు తానే చేసుకోవడం విశేషం. ఆ రోజుల్లో తీసుకున్న రాగి సంగటి, జొన్న రొట్టెలు, కొర్రలు, సజ్జలు వంటి ప్రకృతి సిద్ధమైన ఆహారం ఆమెను నేటికీ ఆరోగ్యంగా ఉంచాయని మేనల్లుడు ఏసన్న తెలిపారు.