News November 19, 2025
ICC అండర్-19 మెన్స్ WC షెడ్యూల్ విడుదల

ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారైంది. జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో 2026 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు టోర్నీ జరగనుంది. 16 టీమ్స్ నాలుగు గ్రూపులుగా విడిపోగా గ్రూపుAలో భారత్, USA, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇక్కడ టాప్ ప్రదర్శన చేసిన జట్లు సూపర్ సిక్స్‌కు, ఈ ప్రదర్శన ఆధారంగా సెమీస్ అనంతరం ఫైనల్ జట్లు ఖరారు కానున్నాయి. పూర్తి షెడ్యూల్ కోసం పైన స్లైడ్ చేయండి.
Similar News
News April 1, 2026
అమరావతికి చట్టబద్ధత.. నేడే పార్లమెంట్‌లో బిల్లు

ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ ముందుకు రానుంది. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా గుర్తించేలా ఏపీ పునర్‌వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు-2026ను లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెడతారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదిస్తారు. గురువారం రాజ్యసభలోనూ దీన్ని ఆమోదించి, శాశ్వత రాజధానికి చట్టబద్ధత కల్పిస్తారు.
News April 1, 2026
ఎలాంటిచోట గొప్పతనం చూపకూడదు?

అనువుగానిచోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువ గాదు
కొండ యద్దమందు కొంచమై యుండదా?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: ఒక పెద్ద కొండ ముందు అద్దం పెట్టి చూస్తే ఆ కొండ చిన్నగా కనిపిస్తుంది. నిజానికి ఆ కొండ స్థాయి తగ్గలేదు. అలాగే మనకు తగని ప్రదేశం లేదా సమయంలో గొప్పతనం చూపకూడదు. అలా తగ్గి ఉన్నప్పటికీ మన స్థాయి తగ్గిపోదు.
<<-se>>#PADHYAM<<>>
News April 1, 2026
నేటి నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం

ఈరోజు నుంచి కొత్త ఐటీ చట్టం అమలులోకి వస్తుంది. దీంతో HYDలో ఉద్యోగులకు ప్రస్తుతం మూలవేతనంలో 40%గా ఉన్న HRA 50%కు పెరగనుంది. ఇకపై HRA క్లెయిమ్ చేసేటప్పుడు యజమాని వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. వార్షిక వడ్డీ ఆదాయం ₹50వేలు మించితే TDS వర్తించనుంది. పిల్లల హాస్టల్ బిల్లు మినహాయింపు ₹300 నుంచి ₹9వేలకు పెరగనుంది. ఉద్యోగులకు ఇచ్చే వార్షిక బహుమతుల పన్ను మినహాయింపు పరిమితి ₹5వేల నుంచి ₹15వేలకు పెరగనుంది.


