News November 19, 2025
MNCL: ప్రతి మహిళకు చీరలు అందేలా చూడాలి

ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు ప్రతి మహిళకు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేందుకు కృషి చేస్తోందన్నారు.
Similar News
News March 21, 2026
కుప్పకూలిన ధరలు.. టమాటా రైతుల కన్నీళ్లు

AP: గిట్టుబాటు ధర లభించక టమాటా రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. అనంతపురం(D) కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న KG ధర గరిష్ఠంగా ₹7, కనిష్ఠంగా ₹3, సగటున ₹5 మాత్రమే పలికింది. అన్నమయ్య జిల్లాలో కోత ఖర్చులూ రాకపోవడంతో అన్నదాతలు పంటను పశువులకు వదిలేశారు. శ్రీకాకుళం(D)లోని పలు గ్రామాల్లో 27 KGల ట్రే ధర ₹70-90కి పడిపోయింది. వ్యాపారులు మాత్రం KG ₹20-30కి విక్రయిస్తుండటం గమనార్హం. మీ ఏరియాలో టమాటా రేటు ఎలా ఉంది?
News March 21, 2026
అనంత జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో వినిపించేలా చేశారు: MLA

గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి వివిధ రంగాల్లో రాణిస్తూ అనంతపురం జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో వినిపించేలా చేశారని పురస్కారాల గ్రహీతలను అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభినందించారు. ఉగాది సందర్భంగా రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఇందులో అనంతపురం జిల్లా నుంచి ముగ్గరికి స్థానం లభించింది.
News March 21, 2026
ఎల్లుండి ఏటూరునాగారం ఐటీడీఏలో ప్రజావాణి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 23న ఏటూరునాగారం ఐటీడీఏలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. ప్రజావాణితో పాటు గిరిజన దర్బార్‌ను కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని శాఖల అధికారులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు.


