News November 19, 2025

ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీతో సింగరేణి సంస్థ కీలక ఒప్పందం

image

సింగరేణి సంస్థ పునరుద్పాదక ఇంధన రంగంలో విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టబోతోంది. ఇందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ అమ్మకంలో సహకారానికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బలరామ్, డైరెక్టర్లు, ఎన్జీఈఎల్ ఉన్నతాధికారులు మౌర్య, బిమల్ గోపాల చారి పాల్గొన్నారు.

Similar News

News March 4, 2026

మండుతున్న ఎండలు.. భారీగా బీర్ల అమ్మకాలు

image

TG: రాష్ట్రంలో బీర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఎండలు మండుతుండడంతో వీటి అమ్మకాలు సాధారణం కన్నా 40% పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి MAR చివర్లో బీర్లకు డిమాండ్ ఏర్పడుతుంటుంది. కానీ ఈసారి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆరంభంలోనే ఆ పరిస్థితి ఉంది. ఇక HYDలో నెలాఖరు నుంచి బీరు అమ్మకాలు పెరుగుతాయి. ఈ అమ్మకాల ద్వారా వేసవి 3మాసాల్లో ₹7000 CR GOVTకి రానున్నాయి.

News March 4, 2026

నిజామాబాద్: బాధ్యులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు

image

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ రమేశ్ కుమార్, హౌజ్ మాస్టర్ కుల్దీప్ యాదవ్, హాస్టల్ వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇన్‌ఛార్జ్ ఆకాశ్ యాదవ్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. అధ్యాపకులు, విద్యార్థులతో భేటీ అయ్యారు. రామ్ చరణ్ ఆత్మహత్య ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News March 4, 2026

YVU డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల

image

కడప YVU పరిధిలోని డిగ్రీ 3, 4, 5వ సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను విశ్వవిద్యాలయ వి.సి ప్రొ బెల్లంకొండ రాజశేఖర్ తన ఛాంబర్‌లో విడుదల చేశారు. రిజిస్ట్రార్ ప్రొ.పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ కె.ఎస్.వి కృష్ణారావుతో కలిసి మాట్లాడుతూ.. డిగ్రీ 3వ సెమిస్టర్‌లో 62.39%, 4వ సెమిస్టర్‌లో 81.58% శాతం, ఐదో సెమిస్టర్ లో 77.14% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. yvuexams.in నుంచి ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు.