News November 19, 2025

HYD: శంషాబాద్‌లో యాక్సిడెంట్

image

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన HYD శంషాబాద్‌లో ఈరోజు వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వర్ధమాన్ కాలేజీలో చదువుతున్న రోహిత్(21), రామటెంకి సిద్ధార్థ(21) మంగళవారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా శంషాబాద్ పరిధి నర్కుడ గ్రామంలో ఒక్కసారిగా ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో సిద్ధార్థ అక్కడికక్కడే మరణించగా తీవ్రగాయాలైన రోహిత్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Similar News

News March 20, 2026

ఆకాశం నుంచి ఆక్రమణల వేట!

image

‘వన్ మ్యాప్ హైదరాబాద్’ పేరుతో LiDAR టెక్నాలజీని వాడుతూ 2,050 చదరపు కిలోమీటర్ల మేర 3D మ్యాపింగ్ చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలోని అంగుళం అంగుళాన్ని డిజిటలైజ్ చేయడం సాంకేతికంగా గొప్పే. రాజకీయ పలుకుబడి ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లు, విలాసవంతమైన ఫామ్ హౌస్‌ల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా?సామాన్యుడి గుడిసెపైనే ప్రతాపం చూపుతుందా? అనేది తెలియాలి. పక్షపాతంగా వెళితేనే 3D మ్యాపింగ్ విలువ.

News March 20, 2026

HYD: గూడు చెదిరింది.. గుండె పగిలింది!

image

మూసీ రివర్ ఫ్రంట్ కోసం దాదాపు 10,235 అక్రమ కట్టడాలను LiDAR సర్వే ద్వారా ప్రభుత్వం గుర్తించింది. బడ్జెట్‌లో వీరికి డబుల్ బెడ్రూం ఇళ్లు, ₹25,000 ఆర్థిక సాయం ప్రకటించినా క్షేత్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం ఇల్లు ఇస్తే సరిపోదు, తరతరాలుగా నగర నడిబొడ్డున ఉపాధి పొందుతున్న వారి జీవనోపాధి పరిస్థితి ఏంటని, అభివృద్ధి అంటే మనుషులను వెళ్లగొట్టడం కాదు.. భాగస్వామ్యం చేయడం అని గుర్తు చేస్తున్నారు.

News March 20, 2026

మూసీ బడ్జెట్ బాగుంది.. మురికి పోతుందా?

image

తెలంగాణ బడ్జెట్ 2026-27లో మూసీ పునరుజ్జీవనానికి (CURE) సుమారు ₹1.5 లక్షల కోట్ల భారీ అంచనా వ్యయాన్ని ప్రకటించారు. మొదటి దశలో 21 కిలోమీటర్ల మేర ₹7,000 కోట్లతో పనులు మొదలవుతున్నాయి. 39 కొత్త ఎస్టీపీలు కడతామని చెబుతున్నా.. పారిశ్రామిక కెమికల్ వ్యర్థాలను అడ్డుకునే కఠిన చట్టాల ఊసే లేదు. కాలుష్యాన్ని ఆపకుండా చేసే ఈ ఖర్చు అంతా “నీళ్ల పాలే” అవుతుందన్నది విశ్లేషకుల హెచ్చరిక. దీనిపై మీ కామెంట్?