News November 19, 2025

వనపర్తి జిల్లాలో TODAY…టాప్ NEWS

image

* శ్రీరంగపురం: రంగసముద్రం రిజర్వాయరులో భారీ కొండచిలువ పట్టివేత
* వనపర్తి: జిల్లా కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
* పానగల్: ధాన్యం తేమశాతం గుర్తింపుపై ఐకెపి సిబ్బందికి శిక్షణ
* ఆత్మకూరులో పని చేయని ఏటీఎం మిషన్లు: వినియోగదారులు
* అమరచింత: కాలిపోయిన పత్తి… నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఎం
* బోరుకు కుళాయి ఏర్పాటు చేయండి

Similar News

News March 21, 2026

పోలవరం: పులి కదలికలు ఇక్కడే ఉన్నాయి..

image

పోలవరం జిల్లాలో పెద్దపులి హల్ చల్ కొనసాగుతుంది. అడ్డతీగల, ఏలేశ్వరం మండలాల సరిహద్దున డి.కృష్ణవరం అటవీ ప్రాంతంలో పులి ఉందని సబ్ DFO సుబ్బారెడ్డి శనివారం మీడియాకు తెలిపారు. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఏలేరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద పులి కదలికలను గుర్తించామని వెల్లడించారు. పరిసర గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. రక్షిత అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్ళవద్దని హెచ్చరించారు.

News March 21, 2026

గుంటుపల్లి ‘రైజ్’కు నీతి ఆయోగ్ గుర్తింపు: కలెక్టర్

image

ఇబ్రహీంపట్నం (M) గుంటుపల్లిలోని రూరల్ ఇన్నోవేషన్స్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్&ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్‌‌కు నీతి ఆయోగ్ గుర్తింపు లభించిందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని అన్నారు. ఈ కేంద్రం ద్వారా మహిళల్లో నైపుణ్యాలను పెంచి, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

News March 21, 2026

ముస్లింలు ఆర్థికంగా ఎదగాలి: అనంతపురం ఎంపీ

image

అనంతపురం అశోక్ నగర్ ఈద్గా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ.. ముస్లిం సోదరులంతా విద్యావంతులై, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.