News November 19, 2025

ప్రకాశం: ‘జిల్లా వ్యాప్తంగా 22న గ్రామసభలు’

image

ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రజలకు అవసరమైన సేవలను గ్రామస్థాయిలోనే అందించేందుకు గ్రామ సభలను నిర్వహించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఈనెల 22వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని, కొత్త జాబ్ కార్డు కోసం, పని కోసం దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు.

Similar News

News November 20, 2025

ఒంగోలు మాజీ MP హత్యలో అతనే సూత్రధారి.?

image

మావోయిస్ట్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఎన్కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సుమారు 37ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న టెక్ శంకర్ పలు మావోయిస్ట్ ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు. అందులో 1995 డిసెంబర్ 1న ఒంగోలు మాజీ MP మాగుంట సుబ్బరామిరెడ్డిపై మావోయిస్టులు జరిపిన కాల్పుల కేసులో సైతం టెక్ శంకర్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

News November 20, 2025

ప్రకాశంలో ఆధార్ తిప్పలు.. కొలిక్కి వచ్చేనా?

image

ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆధార్‌తో పడుతున్న అవస్థలు ఎక్కువేనట. జిల్లాలోని పాఠశాలల్లో 363236 మంది విద్యార్థులు ఉండగా, 302626 మందికి ఆధార్ ద్వారా అపార్ ID వచ్చిందని లెక్క. మిగిలిన 60610 మంది విద్యార్థుల వివరాలు నమోదు కావాల్సిఉంది. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కార్డులో తప్పుగా నమోదైన వివరాలను సవరించినా ఆ వివరాలే వస్తున్నాయని దీంతో అపార్ ఐడీకి పెద్ద చిక్కులు వస్తున్నాయట.

News November 20, 2025

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత.!

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. దీంతో పలుచోట్ల మంచు ప్రభావంతో చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభం కాకముందే చలి అధికంగా ఉండడంతో డిసెంబర్ నెలలో మరింత ఎక్కువ చలి ప్రభావం ఉంటుందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, స్థానికులు అవసరం అయితే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దన్నారు.