News November 19, 2025

ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

image

వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం ఆయన తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామంలో ఇప్పటివరకు మంజూరైన ఇండ్ల నిర్మాణాలు ఏ ఏ దశల్లో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం పూర్తయి ఉన్న ఇంటిని కూడా ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జలజా కుమారి పాల్గొన్నారు.

Similar News

News March 16, 2026

ఆస్కార్ అవార్డులు అందేదెవరికో!

image

మరికాసేపట్లో 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. సిన్నర్స్ మూవీ 16 నామినేషన్లతో టాప్‌లో ఉంది. లియోనార్డో డికాప్రియో నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్-13, సెంటిమెంటల్ వాల్యూ-9, ఫ్రాంకెన్‌స్టైన్-9, హామ్నెట్-8, ఎఫ్1-4 నామినేషన్లు సాధించాయి. తె.4.30 నుంచి హాట్‌స్టార్ OTTలో, స్టార్ మూవీస్ ఛానల్‌లో LIVE చూడొచ్చు.

News March 16, 2026

HYD: పెళ్లి రోజు సంబరం.. అంతలోనే దంపతుల దుర్మరణం

image

పెళ్లి రోజును శనివారం కుమారుడితో కలిసి ఆనందంగా జరుపుకున్న ఆ దంపతులు.. ఆదివారం ఆ కొడుకు కళ్లముందు విగతజీవులుగా మారిన హృదయ విదారక ఘటన మేడిపల్లి PS పరిధిలో జరిగింది. ఒకరి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్, శ్రావణి మృతి చెందారు. కొడుకు సహస్రార్ గాయాలతో బతికి అనాథయ్యాడు.
#BewareWhileDriving

News March 16, 2026

నిజామాబాద్: తస్మాత్ జాగ్రత్త : సీపీ

image

ప్రస్తుత కాలంలో డిజిటల్ లావాదేవీలు ఎంత పెరిగాయో అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ‘ఫేక్ పార్సిల్’, ‘కొరియర్ స్కామ్స్’ ద్వారా అమాయకులను నిలువునా దోచుకుంటున్నారని సీపీ సాయిచైతన్న అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. తక్షణ సహాయం కోసం ప్రభుత్వం కేటాయించిన హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలన్నారు.