News November 19, 2025
మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

HYD మాదాపూర్ శిల్పారామంలో కళాకారులు కూచిపూడి నృత్యప్రదర్శనతో సందర్శకులను ఆకట్టుకున్నారు. బుధవారం గురువు సుప్రియ శిష్యబృందం జయము జయము, శ్రీరంగనాథం, ముద్దుగారే యశోద, ఓం శర్వాణి, జయజయ దుర్గే, అన్నమాచార్య కీర్తనలు, శ్యామల మీనాక్షి, సీతా కళ్యాణం తదితర అంశాలను ప్రదర్శించారు. కళాకారులు చైత్ర, రూప, హరిణి, రిషిత, సమీక్షిత, శ్రీనిక, ప్రమీత, దక్ష, యుక్తశ్రీ, మోక్షిత పాల్గొన్నారు.
Similar News
News November 21, 2025
బరితెగించారు.. మోదీ-మైథిలీపై AI అసభ్యకర వీడియో

AI టెక్నాలజీతో క్రియేటర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా పీఎం మోదీ, బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన సింగర్ మైథిలి ఠాకూర్‌పై అసభ్యకర AI వీడియోను రూపొందించి SMలో పెట్టారు. దీన్ని బీజేపీ నేతలు, శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే ఆ వీడియోను తొలగించాలని, క్రియేట్ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
NOTE: సెన్సిటివిటీ దృష్ట్యా వీడియోను పోస్ట్ చేయలేకపోతున్నాం.
News November 21, 2025
BREAKING: ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియమితులయ్యారు. కాజల్ సింగ్ ఇదివరకు ఉట్నూర్ ఎస్డీపీవోగా, మౌనిక ఇదివరకు దేవరకొండ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.
News November 21, 2025
నిర్మల్ ఏఎస్పీగా సాయికిరణ్

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ ఏఎస్పీగా సాయికిరణ్, భైంసా ఎస్డీపీవోగా రాజేశ్ మీనా నియమితులయ్యారు. రాజేశ్ మీనా గతంలో నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.


