News November 19, 2025
చింతూరు: కాలువలో ఈతకు దిగి యువకుడి గల్లంతు

మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫోర్ బై కెనాల్‌లో ఈతకు దిగిన ఓ యువకుడు బుధవారం గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి ఎలమంచిలిలోని నారాయణపురం గ్రామానికి చెందిన గనిశెట్టి జగదీశ్వరరావు (25)గా గుర్తించామని ఎస్సై సాధిక్ తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ముగ్గురు స్నేహితులు కాలువలోకి దిగగా ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారని చెప్పారు.
Similar News
News March 10, 2026
వనపర్తి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

వనపర్తి జిల్లాలో సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8:30 గంటల వరకు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మదనపూర్‌లో 37.9 డిగ్రీలు, కానాయిపల్లి- 37.6, ఆత్మకూరు- 37.5, దగడ- 37.3, విలియంకొండ- 36.8, వీపనగండ్ల, వనపర్తి- 36.3, పెద్దమందడి- 36.2, జానంపేట, వెలుగొండ- 36.1, అమరచింత- 36.0, కేతపల్లి- 35.7, శ్రీరంగాపూర్‌లో 35.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 10, 2026
యుద్ధం ముగించడం మా చేతుల్లో ఉంది: IRGC

త్వరలో యుద్ధం ముగుస్తుందన్న <<19341728>>ట్రంప్ కామెంట్లపై<<>> ఇరాన్ IRGC స్పందించింది. ‘యుద్ధం ముగించడం మా చేతుల్లో ఉంది’ అని స్పష్టం చేసింది. ‘ఈ ప్రాంత భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించేది సాయుధ బలగాలు. అమెరికా సైనికులు యుద్ధాన్ని ముగించలేరు. మేము పూర్తి శక్తితో యుద్ధం చేస్తున్నాం. మాపై ఆధిపత్యం ప్రదర్శించామని ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారు’ అని మండిపడింది.
News March 10, 2026
NZB: జర జాగ్రత్త..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మోస్రాలో 38.9°C, భీంగల్ 38.7, ఎర్గట్ల, నిజామాబాద్ 38.4, మంచిప్ప, ఆలూరు 38.3, మెండోరా 38.2, పెర్కిట్, బాల్కొండ 38.1, కోటగిరి, గోపన్ పల్లి 38°Cలు నమోదయ్యాయి. కాగా కామారెడ్డి జిల్లాలో ఎల్పుగొండ 38.3°C, కొల్లూరు, బీర్కూర్ 38, సోమూరు 37.8, భిక్కనూరు 37.5, బీబీపేట్ 37.3°C ల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.


