News November 19, 2025

స్టీల్ ప్లాంటుపై ప్రశ్నిస్తే అసహనం ఎందుకు: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ప్లాంటుపై ప్రశ్నిస్తే చంద్రబాబు <<18299181>>సహనం<<>> కోల్పోతున్నారని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. బాధ్యత గల CM స్పందించాల్సిన విధానమిదేనా అని నిలదీశారు. డొంకతిరుగుడు సమాధానాలు మాని ప్రైవేటుపరం కానివ్వమని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. CM వైఖరిపై అనుమానాలున్నాయన్నారు. అటు ప్రభుత్వ పెద్దలు, పోలీసు వ్యవస్థ తెచ్చిన ఒత్తిడితోనే పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీశ్ చనిపోయి ఉంటాడని ఆరోపించారు.

Similar News

News November 20, 2025

తిరుమల: పోటు కార్మికులు కాదు.. ‘పాచక’లు

image

తిరుమలలోని శ్రీవారి పోటు కార్మికులు ప్రసాదాలు తయారు చేస్తుంటారు. ఇక్కడ పనిచేసేవారిని ప్రస్తుతం శ్రీవారి పోటు కార్మికులుగా పిలుస్తుంటారు. తాజాగా వీరికి కొత్త పేరు పెట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. పోటు సూపర్‌వైజర్‌కు ముఖ్య పాచకగా, వర్కర్‌కు పాచకగా నామకరణం చేయాలని నిర్ణయించారు. గతంలో పోటు కార్మికులు టీటీడీ ఛైర్మన్‌ను కలిసి చర్చించడంతో పేర్లు మార్చనున్నారు.

News November 20, 2025

ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

image

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్‌నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.

News November 20, 2025

త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

image

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్‌కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్‌లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.