News November 19, 2025
జనగామ: గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి

జనగామ జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇద్దరు పిల్లల నిబంధన తొలగించడంతో జిల్లాలోని 281 గ్రామాలలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. ప్రభుత్వం పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లనుంది.
Similar News
News March 20, 2026
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: మంత్రి

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలోని ఆయన కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
News March 20, 2026
సూర్యాపేట: ఆ ఇంట్లో ‘ఉగాది’ విషాద ఘటనలు

ఉగాది పండుగ ఆ ఇంట్లో విషాద ఘటనలను నింపుతోంది. SRPT జిల్లా తుంగతుర్తికి చెందిన గుజ్జ నరేందర్(52) ఉగాది రోజు అనారోగ్యంతో చనిపోయారు. ఆయన పెద్ద కూతురు సాయిశ్రీ శుక్రవారం జరిగిన అంత్యక్రియల్లో తండ్రికి తలకొరివి పెట్టడం అందరినీ కదిలించింది. కాగా 2014 మార్చి 31న ఉగాది రోజే నరేందర్ తల్లి కూడా మృతిచెందడం గమనార్హం. తల్లి, కొడుకులిద్దరూ ఉగాది రోజుల్లోనే చనిపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
News March 20, 2026
ANU: రిజల్ట్స్ వచ్చాయి

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫార్మ్. డీ మొదటి ఏడాది, బి.ఫార్మసీ 1-6 సెమిస్టర్ల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. (సెప్టెంబర్/అక్టోబర్ 2025) రీ-వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివ ప్రసాదరావు తెలిపారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను పరిశీలించుకోవాలన్నారు. మార్కుల్లో మార్పులు ఉంటే తదుపరి అకాడమిక్ చర్యలు తీసుకోవాలని సూచించారు.


