News November 19, 2025
జమ్మలమడుగు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా రామసుబ్బారెడ్డి

జమ్మలమడుగు YCP ఇన్‌ఛార్జ్ విషయంలో పార్టీ అధిష్ఠానం కీలక ప్రకటన చేసింది. MLC రామసుబ్బారెడ్డికే ఇన్‌ఛార్జ్ పదవి బాధ్యతలు ఇస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మాజీ MLA సుధీర్ రెడ్డికి 3 మండలాలు, రామసుబ్బారెడ్డికి 3 మండలాలు అప్పగించింది. జగన్ సమక్షంలో జరిగిన ఈ పంచాయితీలో రామసుబ్బారెడ్డికే ఖరారు చేసింది. సుధీర్ రెడ్డికి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పదవి ఇచ్చింది.
Similar News
News November 25, 2025
ప్రొద్దుటూరులో జువెలరీ దుకాణం మూత..! బాధితుల గగ్గోలు

ప్రొద్దుటూరులోని తనకంటి జ్యూవెలరీ దుకాణం మూడు రోజులుగా మూత పడింది. దాంతో బంగారు సరఫరాదారులు, ఆభరణాలకు అడ్వాన్స్ ఇచ్చిన వారు, స్కీముల్లో, చీటిల్లో డబ్బులు కట్టిన వారంతా ఆందోళన చెందుతున్నారు. డబ్బులు కట్టినవారికి జీఎస్టీ రసీదులివ్వకుండా, చీటీలు రాసి ఇవ్వడంతో బాధితులు గగ్గోలు చెందుతున్నారు. వ్యాపారి శ్రీనివాసులును చీటింగ్, కిడ్నాప్, దాడి కేసుల్లో పోలీసులు విచారణ చేస్తుండడంతో ఆందోళన పడుతున్నారు.
News November 25, 2025
కడప జిల్లా హెడ్ క్వార్టర్‌కు ప్రొద్దుటూరు సీఐ..!

ప్రొద్దుటూరు 1టౌన్ సీఐ తిమ్మారెడ్డిని జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిపించి అక్కడ రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. బంగారు వ్యాపారి శ్రీనివాసులు, ఆయన సోదరుడు వెంకటస్వామిపై డబ్బు ఎగవేత, చీటింగ్, కిడ్నాప్ ఫిర్యాదులున్నాయి. ఈ కేసుల్లో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ తిమ్మారెడ్డి విచారణ చేపట్టారు. విచారణ తీరుపై సీఐపై ఆరోపణలొచ్చి ఆయనను హెడ్ క్వార్టర్‌కి పంపినట్లు సమాచారం.
News November 25, 2025
విజేతలుగా కడప జిల్లా టీంలు

పులివెందులలో నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్ – 14 బాలుర, బాలికల ఫైనల్స్‌లో విజేతలుగా కడప జిల్లా జట్లు నిలిచాయి. ఇక రన్నర్‌గా ఈస్ట్ గోదావరి జట్టు నిలిచింది. 6-4 తేడాతో బాలుర జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలికల జట్టు గోదావరి జట్టుపై 2-1 తేడాతో గెలిచింది. ఇందులో అనూష ఉత్తమ ప్రతిభ కనబరిచింది. వీరికి ఎంఈవో చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు.


