News November 19, 2025
HYD: పూజిత చనిపోయింది.. పోలీసుల ప్రకటన

HYD ఘట్‌కేసర్ పరిధి అవుషాపూర్‌లోని <<18219517>>అనురాగ్ యూనివర్సిటీలో<<>> BSC నర్సింగ్ 3rd ఇయర్ చదువుతున్న పూజిత(22) ఈనెల 6న కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలైన ఆమె పంజాగుట్ట నిమ్స్‌లో 13 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి చనిపోయిందని ఘట్‌కేసర్ పోలీసులు ఈరోజు తెలిపారు. కాగా పూజిత స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మలవాడ అని చెప్పారు.
Similar News
News March 19, 2026
ఉగాది పచ్చడికి వేప పువ్వు దొరకట్లేదా?

షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. ఇందులో చేదుకు ప్రతీకగా నిలిచే వేప పువ్వు దొరకడం లేదు. చెట్లను నరికేయడం, తెగుళ్లతో చనిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో వేప పువ్వు దొరుకుతున్నా పట్టణాలు, సిటీల్లో కరవు నెలకొంది. HYDలో కొన్నిచోట్ల చిన్న రెమ్మకే ₹25-30 తీసుకుంటున్నారు. వేప పువ్వుకు ప్రత్యామ్నాయాన్ని పూర్వీకులు సూచించలేదని, అయితే దాని స్థానంలో తులసిని వాడుకోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు.
News March 19, 2026
నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న మాజీ MLA

నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల కానున్నారు. TDP నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడు 98 రోజుల నుంచి జైలులో ఉన్నారు. గురజాల కోర్టు బెయిల్ ఇవ్వడంతోఆయన ఇవాళ విడుదల కానున్నారు. ఇప్పటికే బెయిల్ పేపర్స్‌ను జైలు అధికారులకు అందజేశారు.
News March 19, 2026
తిరుపతి: గుండెపోటుతో రైతు మృతి

పిచ్చాటూరు మండలం కీలపూడి పంచాయతీకి చెందిన రైతు పి.రామకృష్ణారెడ్డి (54) గుండెపోటుతో కన్నుమూశారు. రామకృష్ణారెడ్డి బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకునేలోపే మార్గమధ్యంలో పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతి గ్రామంలో విషాదాన్ని నింపింది.


