News November 19, 2025

సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు జరగడం సంతోషం: చిరు

image

పుట్టపర్తిలో సత్యసాయిబాబా శతజయంతి వేడుకలపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తంచేశారు. ‘ప్రపంచానికి ఆధ్యాత్మికతను, సేవాభావాన్ని పెంపొందించి, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన తలపెట్టిన కార్యక్రమాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయన మనమధ్య లేకపోవచ్చు కానీ ఆయన స్ఫూర్తి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది. రూ.100 స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్ జారీ చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అంటూ ‘X’లో పోస్టు చేశారు.

Similar News

News March 28, 2026

రామనవమి వేళ భద్రాద్రి జిల్లా ప్రజలకు నిరాశే..!

image

శ్రీరామ కళ్యాణానికి వచ్చిన CM రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధి, సంక్షేమ నిధులు విడుదలపై మాట్లాడకపోవడం జిల్లా ప్రజలు జీర్నించుకోలేకపోతున్నారు. గంపెడు ఆశతో జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా జిల్లా అభివృద్ధి సంక్షేమ నిధుల విడుదలపై స్పందిస్తారని ఆశగా చూసిన జిల్లా ప్రజలకు నిరాశ ఎదురైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సమస్యలపై మీడియాతో మాట్లాడకపోవడాన్ని వామపక్షాలు తప్పుపడుతున్నాయి.

News March 28, 2026

ఒక్కో సినిమాకు రూ.15-20 కోట్లు.. నిర్మాతల భయం!

image

‘పుష్ప’, ‘పుష్ప-2’ సినిమాలతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌కు తెలుగులో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన ఒక్క మూవీ కూడా ఒప్పుకోలేదు. ఒక్కో చిత్రానికి రూ.15-20 కోట్ల వరకు డిమాండ్ చేయడమే దీనికి కారణమని టాలీవుడ్ వర్గాల టాక్. ఆ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు భయపడే నిర్మాతలు ముందుకు రావట్లేదని సమాచారం.

News March 28, 2026

MBNR: కొత్త పింఛన్ కోసం.. నాలుగేళ్లుగా ఎదురుచూపు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఆశావాహులు నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అప్పటి BRS ప్రభుత్వంలో మంజూరైన పింఛన్లను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. కొత్తగా 2 లక్షల పింఛన్లు మంజూరు చేస్తామని తాజా బడ్జెట్‌లో ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆశలు మరింత పెరిగాయి. ఇప్పటికే చాలా వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకొని ఉన్నారు. మరి ఎదురుచూపులకు తెరపడేనా..!