News November 19, 2025

హనుమకొండ జిల్లాకు ఇందిరమ్మ చీరలు

image

జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ‘యూనిఫామ్’ పేరుతో నాణ్యమైన చీరల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 9వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత ప్రభుత్వం పోచంపల్లి చీరలు (ఒక్కోటి రూ. 800) అందించనుంది. పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Similar News

News March 22, 2026

కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: డీకే అరుణ

image

మహబూబ్‌నగర్ ఎంపీ క్యాంపు కార్యాలయంలో వివిధ చేతివృత్తుల కుల సంఘాలతో ఎంపీ డీకే అరుణ శనివారం సమావేశమయ్యారు. విశ్వకర్మ, గొల్ల కురుమ, ఇతర బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. స్వర్ణకారులకు రుణ సదుపాయాల కల్పనతో పాటు, వారి విజ్ఞప్తులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

News March 22, 2026

నేడు సిద్దిపేట పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

image

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో జరుగుతున్న ‘రైతు ఉత్సవాలు’ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా సుమారు ₹300 కోట్లతో నిర్మించిన TG ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్రంలోనే మొదటి ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన చేస్తారు. ఇదే వేదికగా రైతు భరోసా మొదటి విడత నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు.

News March 22, 2026

అల్లు అర్జున్-అట్లీ మూవీలో అనుష్క శర్మ?

image

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న మూవీ కాస్టింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీలో ఇప్పటికే దీపికా పదుకొణె, రష్మిక, మృణాల్, జాన్వీ కపూర్ వంటి స్టార్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అనుష్క శర్మ పేరు తెరపైకి వచ్చింది. ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ఈ సినిమాతో పవర్‌ఫుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. ఈ మూవీ టీజర్ ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.