News November 19, 2025
సిద్దిపేట: పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లాలో పూర్తి పారదర్శకంగా జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
Similar News
News March 15, 2026
నంద్యాలలో ‘ఒక్క రూపాయికే’ భోజనం

నంద్యాలలో ఒక్క రూపాయికే భోజనం అందిస్తున్న గోళ్ల రాజేశ్‌ను నంద్యాల బ్లడ్ సెంటర్ నిర్వాహకుడు బ్లడ్ అచ్చు అభినందించారు. ఫుడ్ పాయింట్‌ను సందర్శించిన ఆయన.. అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడారు. భోజనం రుచిగా ఉందని వారు తెలిపారు. నంద్యాలకు వచ్చే ప్రజలకు కేవలం ఒక్క రూపాయికే కడుపునిండా భోజనం అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
News March 15, 2026
గజ్వేల్: RMP డాక్టర్ సూసైడ్

గజ్వేల్ మం. గిరిపల్లికి చెందిన RMP డాక్టర్ నెమటూరి చిన్నమల్లయ్య (41) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు చేసి తీర్చే మార్గం లేక, గత 6 నెలలుగా గజ్వేల్‌లోని అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు పగులగొట్టి చూడగా చిన్నమల్లయ్య ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 15, 2026
ప.గో: బండిపై వెళ్తుంటే భార్య గొంతు కోశాడు.. అసలేం జరిగింది?

భార్య గొంతు కోసిన భర్తను తణుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం సజ్జాపురానికి చెందిన కరగాని దిల్లేశ్వరి బండిపై వెళ్తుండగా, వెనుక కూర్చున్న భర్త గోవిందు బ్లేడుతో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. మనస్పర్ధల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం గోవిందును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. తీవ్ర గాయాలైన దిల్లేశ్వరికి చికిత్స అందుతోంది.


