News November 19, 2025
ఖేడ్: ‘రైతులకు ఆధునిక పరిష్కారం’

ఖేడ్‌లో జరిగిన బాల వైజ్ఞానిక సదస్సులో గుమ్మడిదల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు తయారు చేసిన ‘రైతు మిత్ర’ అనే పరికరం ఆకట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పంట కోత అనంతరం ధాన్యాన్ని ఎండబెట్టుకునే రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ సులభమైన యంత్రాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైతుల కష్టాన్ని తగ్గించి, వారి పనిని సులభతరం చేసే యంత్రాన్ని అభివృద్ధి చేసినట్లు విద్యార్థులు తెలిపారు.
Similar News
News March 14, 2026
సొంత ఊరిలో ‘బ్యాండ్ మేళం’ దర్శకుడికి ఘన స్వాగతం

‘బ్యాండ్ మేళం’ చిత్ర దర్శకుడు జవ్వాజి సతీష్ తన సొంత గ్రామమైన ఇబ్రహీంపట్నంకు చేరుకోవడంతో గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం సర్పంచ్ బద్దం గోపి, ఉపసర్పంచ్ నాంపెల్లి రమేష్, ఆయన చిన్ననాటి స్నేహితులు సతీష్‌ను ఘనంగా సత్కరించారు. సతీష్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీసి ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా ఎదగాలని గ్రామస్థులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, మిత్రులు పాల్గొన్నారు.
News March 14, 2026
మా డ్రెస్సింగ్‌తో మీకేంటి సమస్య: రాశీ ఖన్నా

కంఫర్ట్‌గా ఉండే దుస్తులు ధరించే స్వేచ్ఛ ఏ అమ్మాయికైనా ఉంటుందని హీరోయిన్ రాశీ ఖన్నా అన్నారు. ‘ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది అమ్మాయి ఇష్టం. మేము ఏ దుస్తులు ధరిస్తే మీకేంటి సమస్య’ అని ప్రశ్నించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్లలో ఆమె పాల్గొన్నారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై <<18746820>>చర్చ జరగడాన్ని<<>> ప్రస్తావించగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని, పెళ్లికి ఇప్పుడు సమయం లేదని చెప్పారు.
News March 14, 2026
గ్యాస్ సిలెండర్లపై అసత్య ప్రచారం నమ్మవద్దు: JC

జిల్లాలో గ్యాస్ కొరత ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని JC సేధు మాధవన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి, పట్టణాల్లో 25 రోజులకు ఒకసారి మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని చెప్పారు. అక్రమంగా సిలిండర్లు నిల్వ చేసిన ఘటనల్లో 16 సిలిండర్లను స్వాధీనం చేసుకుని సంబంధితులపై కేసులు నమోదు చేశామన్నారు. గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు.


