News November 19, 2025

సిరిసిల్ల: అపెరల్ పార్కును సందర్శించిన ఇన్‌ఛార్జి కలెక్టర్

image

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్కును ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం సందర్శించారు. గ్రీన్ నీడిల్, టెక్స్‌పోర్ట్ పరిశ్రమలలో వస్త్ర తయారీ దశలను క్షుణ్ణంగా పరిశీలించారు. తయారైన వస్త్రాలను ఎక్కడికి ఎగుమతి చేస్తారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి, వారి యోగక్షేమాలను, వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆరా తీశారు.

Similar News

News March 25, 2026

మునగాల సాగర్ ఎడమ కాలవలో మృతదేహం

image

మునగాల మండల పరిధిలోని సాగర్ ఎడమ కాలవలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం కాలవ వద్దకు వెళ్లిన రైతులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించి వెంటనే గ్రామస్థులకు, సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 25, 2026

పరిమితి దాటిన వైద్యం.. ప్రాణాల మీదకు తెస్తున్న ఆర్ఎంపీలు!

image

ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల ‘అవతారం’ రోగుల పాలిట శాపంగా మారుతోంది. ప్రథమ చికిత్సకే పరిమితం కావాల్సిన వీరు, నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారుల అలసత్వంతో రోగులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తనిఖీలు చేపట్టి, నకిలీ క్లినిక్‌లపై ఉక్కుపాదం మోపాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.