News November 19, 2025

ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన ఆటో డ్రైవర్

image

ఎండాడకు చెందిన బొబ్బిలి రమేశ్ ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలు, భార్యను పోషిస్తున్నాడు. ఈనెల 10న తన నివాసంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. తలలో తీవ్ర రక్తస్రావం అయ్యి ఆరోగ్యం క్షీణించడంతో బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించగా అంగీకరించడంతో అవయవాలను ఐదుగురికి అమర్చనున్నారు. కుటుంబసభ్యుల మంచి మనసును పలువురు మెచ్చుకున్నారు.

Similar News

News March 18, 2026

విజయవాడకు 100 e-బస్సులు.. నిర్వహణకు రూ.46 కోట్లు

image

విజయవాడకు 100 e-బస్సులు కేటాయించారు. వీటిని విద్యాధరపురం డిపోలో మెయింటెనెన్స్ సెంటర్ (రూ.23 కోట్లు), సివిల్ పనులకు రూ.12.5 కోట్లు, సబ్‌స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్లకు రూ.10.5 కోట్లు, కేంద్రం 60%, పీఎం ఈ-బస్ సేవా పథకం కింద 40% రాష్ట్ర నిధులు 6,000 KVA సబ్ స్టేషన్, 20 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇవి 6 నెలల్లో రోడ్లపైకి రానుండగా, పాత నగర బస్సులను దశలవారీగా ప్రభుత్వం తొలగించునుంది.

News March 18, 2026

నెల్లూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

కండలేరు, సోమశిల జలాశయాల భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసి భూములను సంబంధిత శాఖకు అందించేలా చర్యలు తీసుకోవాలి నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబధిత అధికారులకు సూచించారు. తన ఛాంబర్‌లో ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష చేశారు. ఆనం సంజీవయ్య బ్రాంచ్ కెనాల్, కేజీఎం బ్రాంచ్ కెనాల్‌ భూసేకరణ పూర్తైన తర్వాత అవార్డ్ జారీచేయడంతో పాటు యజమానులకు త్వరితగతిన పరిహారం చెల్లించాలని చెప్పారు.

News March 18, 2026

దివ్యాంగుల గౌరవం పెంచేలా ప్రభుత్వం కృషి: లోకేశ్

image

దివ్యాంగుల గౌరవం పెంచేలా ప్రజా ప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరిలో సీఎం చంద్రబాబునాయుడు, డి.సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఉండవల్లి నివాసంలో పథకం లబ్ధిదారులతో జరిగిన ఆత్మీయ విందు సమావేశంలో సీఎంతో కలిపి మంత్రి పాల్గొన్నారు. తన పక్కన కూర్చొన్న శివనాగరాజు, సౌభాగ్య, ఖాశీంబి, అన్నపూర్ణమ్మలతో మమేకమై మాటామంతీ కలిపారు.