News November 20, 2025
HYD: సందీప్ సూసైడ్‌కు కారణమైన నిందితుల ARREST

సందీప్ చావుకి కారణమైన బాలరాజు, హరీశ్‌ను ఈరోజు జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కాప్రా(M) బాలాజీనగర్‌కు చెందిన బాలరాజు, సందీప్ స్నేహితులు. ఇద్దరు దొంగతనాలు చేస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యారు. వీరిలో సందీప్ తప్పు తెలుసుకుని చెడు స్నేహం మానేశాడు. కోపంతో బాలరాజు మరో మిత్రుడు హరీశ్‌తో కలిసి సందీప్‌ను కొట్టగా మనస్తాపం చెందిన అతడు గత రాత్రి బ్లేడ్‌తో గొంతు కోసుకుని చనిపోయాడు.
Similar News
News March 30, 2026
అనకాపల్లి: కలెక్టరేట్‌లో ఘనంగా పీ4 తొలి వార్షికోత్సవం

అనకాపల్లి కలెక్టరేట్‌లో సోమవారం పీ4 తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పేదరిక నిర్మూలనకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయ్ కృష్ణన్ పేర్కొన్నారు. దీనిని విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రజలను పైకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ సౌర్యమాన్ పటేల్ పాల్గొన్నారు.
News March 30, 2026
ప్రకాశం: పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెం సమీపంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కందుకూరు నుంచి పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టుకోవడంతో డ్రైవర్ బస్సును మార్జిన్ దించి పొలాల్లోకి తీసుకెళ్లాడు. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
News March 30, 2026
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో CBNకు ఊరట

AP: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో CM చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. దీనిపై YCP మాజీ MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన 3 పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. కేసును CBIకి అప్పగించాలని, CBNకు గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని, ACB కోర్టు విచారణను MP, MLAల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆయన వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. అయితే వీటికి విచారణార్హత లేదని కోర్టు ఇవాళ కొట్టేసింది.


