News November 20, 2025
WNP: కాంగ్రెస్ జిల్లా ఆఫీసుకు స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు

వనపర్తి మండలం రాజపేట శివారు సర్వేనెంబర్ 73/2 లో జిల్లా కాంగ్రెస్ ఆఫీసు నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఎకరం స్థలం మంజూరు చేశారని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బాధ్యులు బుచ్చయ్య తెలిపారు. ఈ స్థలం కోసం ప్రభుత్వానికి చాలాన్ రూపంలో రూ. 4,84,000 చెల్లించడం జరిగిందని చెప్పారు. గతంలో స్థలం కోసం కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు చేసుకోగాజిల్లా కలెక్టర్ మంజూరి ఉత్తర్వులు జారీ చేశారన్నారు.
Similar News
News March 14, 2026
ప్రాణాలు కాపాడుతున్న పోలీసులు!

అర్థరాత్రి, తెల్లవారుజామున జరిగే ప్రమాదాలను అడ్డుకునేందుకు జిల్లా పోలీసులు శనివారం వినూత్నంగా ‘స్టాప్ వాష్ గో’ కార్యక్రమం నిర్వహించారు. SP ఆదేశాలతో జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాలను నిలిపి డ్రైవర్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్ల కలిగే ముప్పును తప్పించేందుకు లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నారు. పోలీసుల ఈ చొరవతో ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
News March 14, 2026
కామారెడ్డి: చిరుత కళేబరం లభ్యం

బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట అటవీ ప్రాంతంలో చిరుతపులి కళేబరం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారి హబీబ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేటగాళ్ల దుశ్చర్యగా భావిస్తున్న ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
News March 14, 2026
వికారాబాద్: టెన్త్ విద్యార్థులకు అలర్ట్

జిల్లాలో 69 పరీక్షా కేంద్రాల్లో 13,514 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాయన్నారు. బాలురు 6,740 మంది, బాలికలు 6774మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు ఉ.9:30 నుంచి మ.12:30 వరకు నిర్వహించనున్నారు. 9:30నిమిషాలకు పరీక్ష ప్రారంభం అవ్వనుండగా ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.


