News November 20, 2025
దక్షిణాఫ్రికాతో వన్డేలకు బుమ్రా, హార్దిక్ దూరం!

దక్షిణాఫ్రికాతో NOV 30 నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ ప్లేయర్లు బుమ్రా, హార్దిక్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే T20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని వీరికి విశ్రాంతి ఇచ్చే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం. కాగా ఆసియాకప్‌లో గాయపడిన హార్దిక్ కోలుకుంటున్నారు. WC వరకు హార్దిక్ టీ20లపై ఫోకస్ చేస్తారని BCCI వర్గాలు పేర్కొన్నాయి. 2026 FEBలో T20 WC మొదలయ్యే ఛాన్స్ ఉంది.
Similar News
News March 7, 2026
AIతో భారీగా ఉద్యోగాలేమీ పోలేదు: ఆంథ్రోపిక్ రిపోర్ట్

ఏఐ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోలేదని ఆంథ్రోపిక్ వెల్లడించింది. టెక్నాలజీ నైపుణ్యాలు అవసరమయ్యే జాబ్స్‌లో యువ ఉద్యోగుల నియామకాలు తగ్గాయని ఓ నివేదికలో తెలిపింది. కోడింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, అనాలసిస్, రొటీన్ డిజిటల్ డ్యూటీలను నిర్వర్తించే వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఏఐ వినియోగం ఎక్కువని చెప్పుకొచ్చింది. మెకానిక్‌లు, వంటవాళ్లు.. ఇలా మాన్యువల్ సామర్థ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు సమస్య లేదని పేర్కొంది.
News March 7, 2026
గద్దర్ అవార్డులు-2025.. బెస్ట్ ఫిల్మ్ ఇదే..

☞ ఉత్తమ చిత్రం- రాజు వెడ్స్ రాంబాయి
☞ ఉత్తమ ద్వితీయ చిత్రం- దండోరా
☞ ఉత్తమ తృతీయ చిత్రం- ది ప్రీ వెడ్డింగ్ షో
☞ ఉత్తమ వినోదాత్మక చిత్రం- సంక్రాంతికి వస్తున్నాం
☞ నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా- తండేల్
☞ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ- మిరాయ్
☞ ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం- కోర్ట్
☞ ఉత్తమ బాలల చిత్రం- అనగనగా *ఉత్తమ పర్యావరణ చిత్రం- ఇగ్వా *ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్- లిటిల్ హార్ట్స్
News March 7, 2026
తెలంగాణ గద్దర్ అవార్డులు-2025

☞ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్- అనిల్ రావిపూడి(సంక్రాంతికి వస్తున్నాం)
☞ బెస్ట్ సాంగ్ రైటర్- నందకిశోర్(కుబేర)
☞ బెస్ట్ సినిమాటోగ్రాఫర్- కార్తీక్ ఘట్టమనేని(మిరాయ్)
☞ బెస్ట్ ఎడిటర్- శ్రీకర్ ప్రసాద్(మిరాయ్)
☞ బెస్ట్ కొరియోగ్రాఫర్- సందీప్(ఛాంపియన్)
☞ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్- తోట తరణి(ఛాంపియన్)
☞ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్- గోవింద్(అఖండ-2)


