News November 20, 2025

HYDలో రేపు జగన్ భారీ ర్యాలీ.. YSRCP నేతల ఏర్పాట్లు

image

అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ మేరకు బేగంపేట్ నుంచి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు వరకు ర్యాలీగా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్‌ రాకను పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఉన్న YSRCP పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీకి హాజరుకావాలని YSRCP మిత్ర బృందం పిలుపునిచ్చింది.

Similar News

News March 18, 2026

సూర్యాపేట: ఎక్కడ పర్యటన ఉన్నా.. ముందుగా బడికే!

image

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని 23 మండలాల్లో ఆయన ఏ పర్యటనకు వెళ్లినా ముందుగా స్థానిక బడులను పరిశీలిస్తున్నారు. నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటిస్తూ విద్యా ప్రమాణాలను అంచనా వేస్తున్నారు. బోధనలో నాణ్యత పెంచేలా టీచర్లకు సూచనలు ఇస్తున్నారు. కలెక్టర్ పనితీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

News March 18, 2026

బుద్ధవనం.. పర్యాటకులకు ఆకర్షణ కేంద్రం

image

నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనం బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. బుద్ధుడి జీవితం, బోధనలు, జాతక కథలను ప్రతిబింబించే శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రశాంత వాతావరణం, ధ్యానానికి అనువైన ప్రదేశాలతో పాటు థీమ్ పార్కులు, మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

News March 18, 2026

బాపట్ల: ‘నేర నియంత్రణ లక్ష్యంగా పనిచేయాలి’

image

నేర నియంత్రణ లక్ష్యంగా పోలీసు అధికారులు పనిచేయాలని జిల్లా SP ఉమామహేశ్వర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో గంజాయి డ్రగ్స్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేయాలన్నారు.