News November 20, 2025
3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్: భట్టి విక్రమార్క

మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్ దిశగా అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని తెలియజేయడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం, రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన అంశాలను డాక్యుమెంట్‌లో పొందుపరచాలని ప్రజాభవన్‌లో సీఎస్‌లు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో సూచించారు.
Similar News
News November 23, 2025
సత్యసాయి సేవలు విశ్వవ్యాప్తం: కలెక్టర్ కీర్తి

తల్లికిచ్చిన మాట కోసం పుట్టపర్తి నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించిన మహనీయుడు సత్యసాయి అని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కొనియాడారు. ఆదివారం ఆర్కాట్ తోటలోని సత్యసాయి సేవా సమాజంలో జరిగిన శత జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొని కేక్ కట్ చేశారు. ప్రేమ, సేవా భావంతో బాబా చూపిన మార్గం నేటి సమాజానికి ఆదర్శమని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
News November 23, 2025
మొక్కజొన్న, వేరుశనగలో బోరాన్ లోప లక్షణాలు

☛ మొక్కజొన్న: లేత ఆకుల పరిమాణం తగ్గి హరిత వర్ణాన్ని కోల్పోతాయి. జల్లు చిన్నవిగా ఉండి మొక్క నుంచి బయటికి రావు. బోరాన్ లోప తీవ్రత అధికంగా ఉంటే కండెలపై గింజలు వంకర్లు తిరిగి చివరి వరకు విస్తరించవు. దీని వల్ల దిగుబడి, సరైన ధర తగ్గదు. ☛ వేరుశనగ: లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసరిగా కనిపిస్తాయి. బీజం నుంచి మొలకెత్తే లేత ఆకు కుచించుకొని రంగు మారుతుంది.
News November 23, 2025
సామ్ కరన్ ఎంగేజ్‌మెంట్

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్‌ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్‌లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.


