News April 15, 2024

బంగారం ధరలు తగ్గాలంటే రాహుల్ PM కావాలి: జగ్గారెడ్డి

image

TG: రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తే బంగారం ధరలను నియంత్రిస్తారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. మోదీ హయాంలో పెట్రోల్, డీజిల్‌తో పాటు పసిడి ధరలూ పెరుగుతున్నాయని విమర్శించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2014లో తులం బంగారం రేటు రూ.28వేలుగా ఉందని, మోదీ వచ్చాక ఇప్పుడు రూ.75 వేలకు చేరుకుందన్నారు. రాముడిని, హనుమంతుడిని కూడా బీజేపీ నాయకులుగా మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News April 8, 2026

ఆర్చర్ కాకముందు ఆర్టిస్ట్‌గా పాయల్

image

ఒడిశాకు చెందిన పారా ఆర్చర్ పాయల్ నాగ్ ఇటీవలే గోల్డ్ మెడల్ సాధించిన <<19578428>>విషయం<<>> తెలిసిందే. అయితే ఆమెలో మరో టాలెంట్ దాగి ఉంది. పాయల్ ఒకప్పుడు నోటితో పెన్సిల్ పట్టుకొని అద్భుతమైన చిత్రాలు గీసేవారు. ఆమె ప్రతిభను గుర్తించిన కోచ్ కుల్దీప్ వేద్వాన్.. విలువిద్యలో శిక్షణ ఇచ్చారు. అలా 2023లో ప్రారంభించి కేవలం 2-3 ఏళ్ల కఠిన శిక్షణతో ‘వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్’లో స్వర్ణ పతకం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు.

News April 8, 2026

ఎన్నికలకు ముందే ఓ సీటు కోల్పోయిన విజయ్ TVK!

image

దళపతి విజయ్ TVKకు ఎన్నికల ముందే ఎదురుదెబ్బ తగిలింది. ఎడప్పాడి నియోజకవర్గానికి బరిలో నిలిపిన అభ్యర్థి అరుణ్‌కుమార్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. నామినేషన్‌లో మద్దతుగా సరిపడా సంతకాలు లేకపోవడమే కారణం. అరుణ్‌కుమార్‌కు ప్రత్యామ్నాయంగా TVK నిలబెట్టిన నిత్య అనే మరో అభ్యర్థి నామినేషన్ కూడా సేమ్ రీజన్‌తో రిజెక్ట్ అయింది. ఏప్రిల్ 6నే నామినేషన్ గడువు ముగియడంతో TVKకి ఓ సీటు కోల్పోయినట్లు అయింది.

News April 8, 2026

శాంతిని నెలకొల్పాలని గతంలోనే చెప్పాం: భారత్

image

US-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ఉద్రిక్తతలను తగ్గించడం, చర్చలు, దౌత్యపరంగా శాంతిని నెలకొల్పాలని గతంలోనే చెప్పామని గుర్తు చేసింది. యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన సరఫరా, వాణిజ్య నెట్‌వర్క్‌లకు అంతరాయం కలిగిందని, ఆటంకాలు లేకుండా హార్ముజ్ గుండా స్వేచ్ఛగా నౌకలు ప్రయాణిస్తాయని ఆశిస్తున్నామని పేర్కొంది.