News November 20, 2025

కైకలూరులో ఈనెల 20న జాబ్ మేళా: జితేంద్ర

image

కైకలూరు ట్రావెల్స్ బంగ్లా‌లో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి జితేంద్ర బుధవారం తెలిపారు.13కి పైగా కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారని,1,010 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, విద్యార్హత కలిగిన 18-30 ఏళ్లవారు అర్హులన్నారు. బయోడేటా, సర్టిఫికెట్స్ జిరాక్స్‌లతో రావాలన్నారు.

Similar News

News March 15, 2026

బిజినేపల్లి: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో మెయిన్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రామచంద్రయ్య(50) మెయిన్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలి.

News March 15, 2026

కొండగట్టు: ఆలయ భూమిని ఆక్రమించిన వ్యక్తిపై కేసు

image

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి చెందిన భూమిలో అక్రమంగా నిర్మాణాలను చేపడుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు మల్యాల SI నరేష్ తెలిపారు. ముత్యంపేటకు చెందిన నల్లగొండ నర్సయ్య అనే వ్యక్తి కొండగట్టు దిగువ ప్రాంతంలో సర్వేనెంబర్ 380/c నందు గల 2 గుంటల భూమిని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నట్లు ఆలయ ఈవో పోలీసులకు దరఖాస్తు ఇవ్వగా, ఆ దిశగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

News March 15, 2026

MNCL: అధికారులకు క్రీడలతో ఉపశమనం: కలెక్టర్

image

ప్రభుత్వ అధికారులకు క్రీడలతో పని ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుందని కలెక్టర్ కుమార దీపక్ అన్నారు. రెండు రోజులుగా జరిగిన రెవెన్యూ అధికారుల క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. నిత్యం బిజీగా ఉండే అధికారులకు క్రీడలు మేలు చేస్తాయన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య(స్థానిక సంస్థలు), ట్రైన్ డిప్యూటీ కలెక్టర్ విరాహత్ అలీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.