News November 20, 2025

కామారెడ్డి జిల్లాకు మంత్రి సీతక్క

image

మంత్రి సీతక్క నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉ.10:30 గంటలకు భిక్నూర్ చేరుకుంటారు. భిక్నూర్, కామారెడ్డి AMC భవనాల వద్ద టాయిలెట్ బ్లాక్, కాంపౌండ్ వాల్ తదితర పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, KMR మునిసిపాలిటీ పరిధిలోని వార్డుల్లో CC రోడ్లు, డ్రైన్లు, బీటీ రోడ్లు వంటి పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. లైబ్రరీ ఉత్సవాల సందర్భంగా గ్రంథాలయ కార్యాలయంలో పుస్తకాలను పంపిణీ చేస్తారు.

Similar News

News March 20, 2026

ఆదిలాబాద్: చెరువు మట్టితో చేనుకు లాభం

image

ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చెరువుల పూడికతీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వేసవి నేపథ్యంలో కూలీలకు చేతినిండా పని దొరకడంతో పల్లెల్లో సందడి నెలకొంది. చెరువుల్లోని సారవంతమైన నల్లమట్టిని రైతులు పోటీపడి తమ పొలాలకు తరలిస్తున్నారు. ఈ పనులతో భూగర్భ జలాలు పెరగడమే కాకుండా, సాగు భూములకు బలం చేకూరుతోంది. పని ప్రదేశాల్లో కూలీలకు ఇబ్బంది కలగకుండా నీడ, తాగునీరు వంటి సౌకర్యాలను అధికారులు కల్పిస్తున్నారు

News March 20, 2026

నాగార్జునసాగర్ చేపల ఫ్రై రుచికి పర్యాటకులు ఫిదా

image

నాగార్జునసాగర్ జలాశయం తాజా చేపల వంటకాలకు పెట్టింది పేరు. ఇక్కడ దొరికే చేపలతో చేసే స్పెషల్ ఫ్రై రుచికి స్థానికులతో పాటు వెయ్యి మందికి పైగా పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. ప్రత్యేక మసాలాలతో వేయించిన ఈ చేపలకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. సాగర్ రోడ్డు వెంట ఉన్న సుమారు 10 హోటళ్లు, స్టాళ్లలో తాజాగా పట్టిన చేపలను విక్రయిస్తున్నారు. సాగర్ సందర్శనకు వచ్చే వారు ఈ అమోఘమైన రుచిని అస్సలు వదులుకోవడం లేదు.

News March 20, 2026

నల్గొండ కేవీలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

నల్గొండ పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఒకటో తరగతి, బాలవాటిక-3లో చేరేందుకు ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. అలాగే 2 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీల ఆధారంగా ఏప్రిల్ 2 నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆసక్తి గల తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.