News November 20, 2025
పొగ మంచులో ప్రయాణాలు జాగ్రత్త: ఎస్పీ

పొగ మంచులో ప్రయాణాలు చేసేటప్పుడు వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. వాహనదారులు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురిసే సమయంలో ప్రయాణాలు చేయడం శ్రేయస్కరం కాదన్నారు. నిదానంగా వాహనాలు నడపాలని, ఫాగ్ లైట్లు, పార్కింగ్ లైట్లతో పాటు తక్కువ బీమ్ హెడ్‌లైట్లను ఉపయోగించాలన్నారు.
Similar News
News March 25, 2026
జగిత్యాల: వివిధ దినుసులు ధరలు ఇలా..!

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. పసుపు (పిల్ల కొమ్ము) క్వింటాల్ గరిష్ఠ ధర రూ.11,900, కనిష్ఠం రూ. 8,000, పసుపు (మండ కొమ్ము) గరిష్ఠం రూ. 10,500, కనిష్ఠం రూ. 7,000, మక్కలు గరిష్ఠం రూ. 1,880, కనిష్ఠం రూ. 1,606, కందులు గరిష్ఠం రూ. 6,889, కనిష్ఠం రూ. 6,050, అనుములు గరిష్ఠం రూ. 5,152, కనిష్ఠం రూ. 4,000గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
News March 25, 2026
రింకూకు KKR ప్రమోషన్

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. రహానే కెప్టెన్‌గా కొనసాగుతుండగా రింకూ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నారు. RCBకి వెళ్లిపోయిన వెంకటేష్ అయ్యర్ ప్లేస్‌ను రింకూ భర్తీ చేయబోతున్నారు. కేవలం ఫినిషర్‌గానే కాకుండా టీమ్ లీడర్‌గా రింకూను ఎదిగేలా చూడడమే ఫ్రాంచైజీ ప్లాన్.
News March 25, 2026
మెట్‌పల్లి: పసుపు క్వింటాల్ రూ.13,189

మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పలికిన పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 13,189, కనిష్ఠం రూ. 9,226, పసుపు గోళ గరిష్ఠం రూ. 11,688, కనిష్ఠం రూ. 9,111, పసుపు చూర గరిష్ఠం రూ. 11,405, కనిష్ఠం రూ. 8,829గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ రోజు మార్కెట్‌లో మొత్తం 2,448 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయన్నారు.


