News November 20, 2025
కృష్ణా: బీటెక్ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో జులై 2025లో నిర్వహించిన బీటెక్ 2వ సెమిస్టర్(2024-25 అకడమిక్ ఇయర్) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 25లోపు ఒక్కో పేపరుకు రూ.1,000 ఫీజు ఆన్‌లైన్‌లో http://www.onlinesbi.com/లో చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.
Similar News
News March 20, 2026
భద్రాద్రి రాముడిపై వివాదం.. 23న హైకోర్టు విచారణ

భద్రాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీరాముడు ‘దశరథ రాముడా’ లేదా ‘వైకుంఠ రాముడా’ అనే అంశంపై నెలకొన్న వివాదంపై ఈ నెల 23న హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై స్పష్టత కోసం ప్రభుత్వం ఇప్పటికే ఐదుగురు పండితులతో కూడిన కమిటీని నియమించగా, వారు తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికలోని అంశాలపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. కోర్టు విచారణ అనంతరం ఈ వివాదానికి తెరపడే అవకాశం ఉందని భక్తులు భావిస్తున్నారు.
News March 20, 2026
నల్గొండ: 20 రోజుల్లోనే రూ.30 పెంపు.. బెంబేలెత్తుతున్న జనం

పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు జిల్లాలోని వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ వ్యాపారులు వంట నూనెల ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారు. జిల్లాలో గత 20 రోజుల్లోనే కిలో ప్యాకెట్‌పై ఏకంగా రూ.30 వరకు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పామాయిల్ రూ.140కి చేరగా, పల్లీ నూనె రూ.175లకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న విమర్శలున్నాయి.
News March 20, 2026
ఎన్నికల బరిలో హత్యాచార బాధితురాలి తల్లి!

బెంగాల్ ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో <<15698320>>హత్యాచారానికి <<>>గురైన బాధితురాలి తల్లి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. పానీహటి నుంచి కంటెస్ట్ చేయాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. గతంలో BJP తనకు టికెట్ ఆఫర్ చేసిందని చెప్పారు. ఇటీవల ఆ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా పానీహటి సీటును పెండింగ్‌లో పెట్టింది. దీంతో ఆమెకే టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుంది.


