News November 20, 2025

సంగారెడ్డి: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో 9, 10 తరగతులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం డిసెంబర్ 31 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు దరఖాస్తులను www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కులం, ఆదాయం, ఆధార్ కార్డు బోనాఫైడ్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News March 5, 2026

భర్త జీతం నుంచి నేరుగా భార్య ఖాతాకు భరణం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

image

కూతురితో జీవిస్తున్న భార్యకు భరణం చెల్లించాలన్న ఆదేశాలు పాటించని భర్తకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రతి నెలా అతని జీతం నుంచి ₹25Kను నేరుగా భార్య ఖాతాలో జమ చేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అతను 2022 నుంచి భార్య నుంచి విడిగా ఉంటూ భరణం ఇవ్వట్లేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా ‘భరణం దాతృత్వం కాదని, భార్య, పిల్లలు గౌరవంగా జీవించడానికి ఉద్దేశించిన చట్టపరమైన హక్కు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

News March 5, 2026

అహోబిలంలో తెప్పోత్సవాలు ప్రారంభం

image

దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి తెప్పోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. 46వ పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ సమక్షంలో, కావు రామానుజన్ అధ్వర్యంలో ఉత్సవమూర్తులు శ్రీప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఆలయం నుంచి ఊరేగింపుగా కోనేరు వద్దకు తీసుకు వచ్చారు. తెప్పలో ఉంచి ఐదు చుట్టులు విహరింపజేశారు.

News March 5, 2026

భద్రాద్రి: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

image

భద్రాద్రి జిల్లా నూతన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్‌ను జిల్లా కోర్టు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినందుకు జడ్జి వసంత్ పాటిల్.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌కు సూచించారు.