News November 20, 2025
SRCL: ఇందిరమ్మ చీరల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి వీసీ

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ గరీమ అగర్వాల్ పాల్గొన్నారు. పంపిణీకి సంబంధించిన జిల్లా వివరాలను ఆమె సీఎంకు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Similar News
News March 8, 2026
బంగ్లాలో ‘Gen Z’ పార్టీ ఎందుకు ఓడింది?(1/2)

బంగ్లాదేశ్‌లో హసీనా, నేపాల్‌లో కేపీ శర్మ ప్రభుత్వాలు కూలిపోవడానికి Gen Z నిరసనలే కారణం. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా యువత పోరాటం చేసింది. అయితే బంగ్లాలో స్టూడెంట్స్ నహిద్, హస్నాత్, అఖ్తర్ ఏర్పాటుచేసిన నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. హింసను నమ్ముకోవడం, ప్రజలకు భరోసా కల్పించలేకపోవడం, రాజకీయ అనుభవలేమి, వివాదాలు ప్రధాన కారణం. అటు నేపాల్‌లో Gen Z ఎన్నికల్లో సత్తా చాటింది.
News March 8, 2026
నేపాల్‌లో ‘Gen Z’ ఎలా గెలిచింది?(2/2)

నేపాల్‌లో కేపీ శర్మ ప్రభుత్వం SMపై నిషేధం విధించడంతో Gen Z తిరుగుబాటు చేసింది. ఈ ఉద్యమంలో బాలెన్ షా కీలక పాత్ర పోషించారు. ర్యాపర్‌గా రాజకీయ అవినీతి, ప్రజాసమస్యలను పాటల రూపంలో వివరించారు. నిరసనల సమయంలోనే PM ఆఫర్ వచ్చినా ఆయన తిరస్కరించి కాఠ్‌మాండూ మేయర్‌గా గెలిచారు. తర్వాత రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP)లో చేరి ప్రజల ఇబ్బందులపై దృష్టిసారించారు. యువతను సరైన దారిలో నడిపిస్తూ గెలుపు బావుటా ఎగురవేశారు.
News March 8, 2026
ట్రంప్‌ను వదిలేది లేదు.. ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్

అయతుల్లా ఖమేనీ మృతికి ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని హెచ్చరించారు. తమ నాయకుడు చిందించిన రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని Xలో స్పష్టం చేశారు. ‘ఇరాన్‌కు వ్యతిరేకంగా తమ భూభాగాలను US ఉపయోగించుకోకుండా మిడిల్ ఈస్ట్ దేశాలు నిరోధించాలి. ఆ ప్రాంతాల నుంచి దాడి జరిగితే మేం ప్రతిస్పందిస్తాం’ అని తేల్చిచెప్పారు. IRGC కొందరు అమెరికన్ సైనికులను బంధించిందని పేర్కొన్నారు.


