News November 20, 2025

మెదక్: అభ్యంతరాలుంటే చెప్పండి: డీఈఓ

image

మెదక్ జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీలు గల 4 అకౌంటెంట్, 5 ANM ఉద్యోగాల భర్తీ కోసం మహిళ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. మెరిట్ లిస్టు https://medakdeo.com/ వెబ్ సైట్
లో పెట్టినట్లు చెప్పారు. అభ్యంతరాలుంటే ఈనెల 25 సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలని ఇన్‌ఛార్జ్ విద్యాశాఖ జిల్లా అధికారి విజయలక్ష్మి సూచించారు.

Similar News

News March 31, 2026

పథకాల వివరాలు ప్రజలకు వివరించాలి: భట్టి విక్రమార్క

image

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు, లబ్ధిదారుల వివరాలను ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. గ్రామ సభల ద్వారా ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు.

News March 31, 2026

మెదక్: 33మంది హజ్ యాత్రికులకు టీకా

image

మెదక్ జిల్లా నుంచి ఎంపికైన 33 మంది హజ్ యాత్రికులకుమంగళవారం జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక “టీకా శిబిరం” నిర్వహించారు. ఈ శిబిరంలో యాత్రికులకు సంబంధించిన అన్ని రకాల అవసరమైన వైద్య పరీక్షలు చేసి టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సునీతా దేవి, జిల్లా వ్యాక్సిన్ అధికారి మాధురి, జిల్లా హజ్ కో-ఆర్డినేటర్ మహమ్మద్ ఎజాజుద్దీన్ పాల్గొన్నారు.

News March 31, 2026

హనుమాన్ జయంతికి పోలీసు బందోబస్తు: ఎస్పీ

image

హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. పండుగను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని హనుమాన్ దేవాలయాలు, ఊరేగింపు మార్గాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.