News November 20, 2025
సిద్దిపేట: కూలి రూపం.. హిడ్మా మరో కోణం!

మావోయిస్టు పార్టీలో చేరినప్పటి నుంచి దళంలో అత్యంత వేగంగా ఎదిగిన వ్యక్తి హిడ్మా. అయితే హిడ్మా జీవితంలో, మరొక కోణం దాగి ఉంది. పదేళ్ల క్రితం హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి ప్రాజెక్టు టన్నుల్లో కూలి రూపంలో పనిచేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులో కూలిగా వ్యవహరిస్తూనే ఆయన పార్టీ రహస్య కార్యకలాపాలు చేశాడన్న విషయం తర్వాత పోలీసులకు అర్థమైంది. హిడ్మా మరణంతో ఈ విషయాలు బయటపడుతున్నాయి.
Similar News
News March 13, 2026
ఈ యాప్ గురించి మీకు తెలుసా?

మీ ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోయిందా? మూగజీవి చనిపోయి కుళ్లిన వాసనతో ఇబ్బంది పడుతున్నారా? వీటి గురించి కంప్లైంట్ చేసేందుకు ‘Swachhata’ అనే యాప్ ఉంది. వివిధ సమస్యలను ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు. నేరుగా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు వెళ్తుంది. నిర్ణీత సమయంలోగా అధికారులు ఆ సమస్యను పరిష్కరించి, ఫొటోను అప్‌లోడ్ చేస్తారు. ఇది కేవలం పట్టణ ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది.
News March 13, 2026
గద్వాల: గ్యాస్ సిలిండర్ల కొరత లేదు – కలెక్టర్

జిల్లాలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి కొరత లేదని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. సిలిండర్ల కోసం వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరఫరా నిరంతరం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
News March 13, 2026
జగిత్యాల: జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కారాగారంలో శుక్రవారం ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో హెచ్ఐవి, హెపటైటిస్ B, Cతో పాటు రక్తపరీక్షలు ఉచితంగా నిర్వహించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల పాథాలజిస్ట్ డా. కె. ప్రవీణ్, ఖిలగడ్డ వైద్యాధికారి డా. సంతోష్, ఐసీటీసీ సిబ్బంది పాల్గొన్నారు.


