News November 20, 2025
HYD: ట్రేడ్ లైసెన్స్ గడువు పొడిగింపు

ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, కొత్త దరఖాస్తుల గడువును GHMC పొడిగించింది. డిసెంబర్ 1 వరకు ఉన్న గడువును MCC కారణంగా డిసెంబర్ 20వ తేదీ వరకు పొడిగిస్తూ కమిషనర్ బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీంతో వ్యాపారులు ఎటువంటి పెనాల్టీ లేకుండా డిసెంబర్ 20 వరకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్, మీ-సేవ కేంద్రాల ద్వారా సమర్పించవచ్చు. లైసెన్స్ లేని వ్యాపారాలపై 100% జరిమానాతోపాటు ప్రతినెల 10% అపరాధ రుసుము వసూలు చేస్తారు.
Similar News
News March 17, 2026
HYD: ఫ్లోర్ కడిగినందుకు రూ.5వేల FINE

HYDలో తాగునీటి దుర్వినియోగంపై HMWSSB కఠినచర్యలు చేపట్టింది. జూబ్లీహిల్స్ వాసి తాగునీటితో ఫ్లోర్లు కడుగుతుండగా గుర్తించి రూ.5వేల జరిమానా విధించారు. ప్రజల నుంచి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తాగునీటిని వృథా చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.
News March 17, 2026
HYD: భారీగా పెరిగిన ధరలు.. అడ్డుకోరా!

వాణిజ్య గ్యాస్ కొరత సాకుతో నగరంలో హోటల్ తిండి హోరెత్తుతోంది. టీ కప్పు నుంచి టిఫిన్ ప్లేట్ దాకా HYDలో ₹5- ₹10 వరకు పెంచేసిన హోటళ్లు.. గ్యాస్ సరఫరా చక్కబడినా ధరలు తగ్గిస్తారన్న గ్యారెంటీ లేదని ప్రజలు వాపోతున్నారు. గతంలో ధరలు పెరిగినా మళ్లీ కిందికి రాలేదు. ఉదాహరణకి ‘ఆనియన్ సలాడ్’! ఈ భారమంతా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన విద్యార్థులు, మధ్యతరగతి జీవుల మీదే పడుతోందంటున్నారు. ఈ దోపిడీని అడ్డుకోరా?
News March 17, 2026
HYD: మెట్రో ఆస్తులు గుట్టుగా ప్రైవేట్ పరం!

మెట్రోను సర్కార్ తీసుకునేలోపే ఆస్తులన్నీ PVT బాబులకు కట్టబెట్టే ప్లాన్ పక్కాగా అమలైతోంది. రాయ్‌దుర్గ్, అమీర్‌పేట్ సహా మెయిన్ స్టేషన్లలోని ఖరీదైన కమర్షియల్ స్థలాలు ప్రభుత్వానికి హ్యాండోవర్ చేయకముందే కావాల్సిన సంస్థలకు 15- 20 ఏళ్లకు లీజుకు ఇచ్చేశారు. అంటే రేపు మెట్రో పబ్లిక్ ప్రాపర్టీ అయినా అక్కడ వచ్చే కిరాయిలు మాత్రం ప్రైవేటు బాబుల జేబుల్లోకి వెళ్తాయి. తాజాగా జరిగిన లీజ్ డీడ్స్‌తో బాగోతం బయటపడింది.


