News November 20, 2025

పొంచి ఉన్న ప్రమాదం

image

ధర్మవరం పట్టణం నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారి మోటమర్ల గ్రామం వద్ద కల్వర్టుపై రక్షణ గోడలు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. కల్వర్టుపై ఎదురెదురుగా వాహనాలు వచ్చిన సమయంలో కాలువలోకి పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. అధికారులు స్పందించి ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించాలని కోరారు.

Similar News

News March 12, 2026

విద్యార్థులకు మాతృ హృదయంతో బోధించాలి: డా. స్వప్న

image

పిల్లలకు మొదటి గురువు తల్లి అని, విద్యార్థులకు మాతృ హృదయంతో బోధించాలని సెన్సార్ బోర్డు మెంబర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కళ్లెం స్వప్న అన్నారు. గురువారం తపస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ సుజాత అధ్యక్షతన మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఉపాధ్యాయుల బోధన విద్యార్థుల్లో ప్రగాఢ విశ్వాసాన్ని పెంపొందిస్తుందని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కొనియాడారు.

News March 12, 2026

పకడ్బందీగా టెన్త్ వార్షిక పరీక్షలు: HNK కలెక్టర్

image

ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని HNK కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె మాట్లాడుతూ..12079 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరవుతారని, ఇందుకు 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 64 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 64 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 64 మంది సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది నియమించారు.

News March 12, 2026

MNCL: ‘PRTU స్థలం ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి’

image

మంచిర్యాల పట్టణంలో పీఆర్టీయూ స్థలం ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం స్థలాన్ని ఆయన ఉపాధ్యాయులతో కలిసి పరిశీలించారు. స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్న వారిపై అధికార యంత్రాంగం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్యాయం జరిగితే ఆందోళన తప్పదని హెచ్చరించారు.