News November 20, 2025
అరబికా పార్చిమెంట్ కిలో రూ.450: జీసీసీ ఛైర్మన్

పాడేరు: కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పాడేరులోని ఆయన కార్యాలయంలో మాట్లాడారు. గిరిజన సహకార సంస్థ ద్వారా కాఫీ కొనుగోలుకు ధరను అధికారికంగా ప్రకటించామన్నారు. 2025–2026 కాఫీ కొనుగోలు ధర అరబికా పార్చిమెంట్ కిలో రూ.450, అరబికా చెర్రీ కిలో రూ.270, రోబస్టా చెర్రీ కిలో రూ.170గా నిర్ణయించినట్లు చెప్పారు.
Similar News
News March 21, 2026
శ్రీశైలంలో వీడియో వైరల్.. కేసు నమోదు..!

శ్రీశైలం ఆలయంలోని స్వామివారి మూల విరాట్ <<19434989>>వీడియో వైరల్<<>> ఘటనను దేవస్థానం అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేవస్థానం అధికారుల ఫిర్యాదు మేరకు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI సుబ్బారెడ్డి తెలిపారు.
News March 21, 2026
‘ధురంధర్’.. హీరో రెమ్యునరేషన్ ఎంతంటే?

ధురంధర్ సినిమా రెండు పార్టులకు కలిపి దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది. హీరో రణ్‌వీర్ సింగ్ రూ.50 కోట్లు, సంజయ్ దత్ రూ.10 కోట్లు, మాధవన్ రూ.9 కోట్లు, అక్షయ్ ఖన్నా రూ.2.5 కోట్లు, అర్జున్ రాంపాల్ రూ.కోటి, సారా అర్జున్ రూ.కోటి తీసుకున్నట్లు సమాచారం. కాగా పార్ట్-1 రూ.1,300 కోట్ల కలెక్షన్లు సాధించింది. పార్ట్-2 అంతకంటే ఎక్కువే రాబట్టడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు.
News March 21, 2026
మంగళగిరి ఎయిమ్స్‌లో లైంగిక వేధింపుల కలకలం

మంగళగిరి AIIMSలో లైంగిక వేధింపుల కలకలం రేపుతున్నాయి. సెక్యూరిటీ సూపర్ వైజర్ మోహనాచారి వేధింపులు భరించలేక ఓ మహిళా సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భర్త చనిపోవడంతో ఓ మహిళ AIIMSలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుందని, ఈ క్రమంలో మోహనాచారి రాత్రి వేళల్లో ఫోన్‌లు చేసి వేధిస్తున్నట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో అతడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.


