News November 20, 2025

ఎన్టీఆర్: సీఆర్డిఏలో 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, స్ట్రాటజీ & కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 24లోపు https://crda.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని CRDA కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. విద్యార్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడాలన్నారు.

Similar News

News March 18, 2026

కేయూ పరీక్ష వాయిదా.. ఏప్రిల్‌ 4కు మార్పు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఎం.ఎస్సీ ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ పరీక్ష వాయిదా పడింది. మార్చి 18న జరగాల్సిన ఈ పరీక్షను ఏప్రిల్‌ 4కి మార్చినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల తెలిపారు. మిగిలిన అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

News March 18, 2026

ఏక పంట విధానం.. అన్నదాతకు నష్టం

image

ఒకే పంటను ఏటా ఒకే భూమిలో పండించే వ్యవసాయ పద్ధతినే ‘మోనోక్రాపింగ్'(ఏకరీతి పంట) అంటారు. తెలుగు రాష్ట్రాలలో ఇది ఎక్కువగా అమల్లో ఉంది. ఈ విధానం తొలుత లాభదాయకంగా కనిపించినా క్రమంగా పంట ఉత్పాదకత తగ్గుతుంది. భూ భౌతిక లక్షణాల క్షీణత, సేంద్రియ కర్బనం తగ్గడం, భూగర్భ జలాల కాలుష్యం, నేలల స్థిరత్వం దెబ్బతిని చీడపీడల బెడద పెరుగుతుంది. అందుకే పంట మార్పిడి విధానం అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News March 18, 2026

అమలాపురంలో జిల్లా స్థాయి పోటీలు.. పాల్గొనేందుకు రెడీనా?

image

అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో మార్చి 24వ తేదీ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ మాస్టర్స్ ఎంపి కలు నిర్వహిస్తున్నట్లు క్రీడాధికారి వీఆర్ రుద్ర తెలిపారు. 35, 45 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు 100, 400, 800 మీటర్ల రన్నింగ్ పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.