News November 20, 2025
కొత్త సినిమాల కబుర్లు

* పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుందని నిర్మాత రవి శంకర్ వెల్లడి.
* బాక్సాఫీస్ రారాజు వస్తున్నాడంటూ రాజాసాబ్ టీమ్ ట్వీట్. డిసెంబర్ 4న నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్ అవుతాయని ప్రకటన.
* తమిళ హీరో సూర్యకు టాలీవుడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కథ చెప్పినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉందని చర్చ.
Similar News
News March 23, 2026
ఎన్నికల కోసమే సేవలా: మోహన్ భాగవత్

సేవ చేయడం అంటే ఇతరులకు ఉపకారం చేయడం కాదని, అది ఒక బాధ్యత అని RSS చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. నిస్వార్థంగా సేవ చేస్తే కల్మషాలు తొలగిపోయి ఆత్మశుద్ధి జరుగుతుందని వివరించారు. కేవలం ఎన్నికల సమయంలోనో లేదా స్వార్థ ప్రయోజనాల కోసమో చేసే పనులు ఎక్కువ కాలం నిలబడవని, కోరికలు తీరగానే అలాంటి వారు సేవను వదిలేస్తారని విమర్శించారు. భయం వల్ల లేదా బలవంతంగా చేసేది కూడా నిజమైన సేవ అనిపించుకోదని పేర్కొన్నారు.
News March 23, 2026
యుద్ధానికి కావాల్సినంత డబ్బుంది: బెస్సెంట్

ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు అమెరికా వద్ద కావాల్సినంత డబ్బు ఉందని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. ట్రంప్ తన అధికార పరిధిలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారని సమర్థించారు. యుద్ధం కోసం అదనంగా కేటాయిస్తున్న నిధులు కేవలం ఎక్స్‌ట్రా మాత్రమేనని.. అసలు పోరాటానికి సరిపడా డబ్బు ఇప్పటికే ఉందని తెలిపారు. ఇరాన్ విషయంలో ప్రస్తుతానికి అన్ని ఆప్షన్లు రెడీగా ఉన్నాయని పేర్కొన్నారు.
News March 23, 2026
మార్చి 23: చరిత్రలో ఈరోజు

1893: ఇంజినీర్ జి.డి.నాయుడు జననం
1934: సినీ గాయకుడు కె.బి.కె.మోహన్ రాజు జననం
1968: సినీ నటుడు శ్రీకాంత్ జననం
1979: సినీ గాయకుడు విజయ్ ఏసుదాస్ జననం
1987: నటి, పొలిటీషియన్ కంగనా రనౌత్ జననం
1931: జాతీయోద్యమ నాయకులు భగత్ సింగ్ (ఫొటోలో), సుఖ్ దేవ్ మరణం
* ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం


