News November 20, 2025
విజయవాడలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

UPSC సివిల్స్ పరీక్షకు సిద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్లాసులలో జాయినయ్యే ఆసక్తి ఉన్న అభ్యర్థులు విజయవాడ అశోక్‌నగర్, పండరీపురం రోడ్ నం 8లో ఉన్న స్టడీ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రవేశ పరీక్ష నిర్వహించి ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.
Similar News
News March 12, 2026
నెల రోజుల్లోగా స్మార్ట్ కిచెన్ పనులు పూర్తి చేస్తాం: కడప కలెక్టర్

కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 33 స్మార్ట్ కిచెన్ల నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సీఎం చంద్రబాబుకు వివరించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
News March 12, 2026
తిరుపతి: టెండర్ల నిబంధనలపై కమిషన్ విచారణ

కల్తీ నెయ్యి వివాదంపై ఏకసభ్య కమిషన్ దినేశ్ కుమార్ బుధవారం టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ విభాగంతో చర్చించారు. జీఎం ఉమాశంకర్ సహా మరికొందరి ఉద్యోగులతో గతంలో టెండర్ల నిబంధనలు.. ప్రస్తుత ధరలు, నిబంధనలు మార్పు చేయాలంటే ఏలాంటి నిబంధనలు పాటించాలనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా మరికొన్ని విభాగాల ఆధికారులతో సైతం చర్చించే అవకాశం ఉంది.
News March 12, 2026
నెల్లూరు కలెక్టర్‌పై CM ప్రశంసలు

జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే “వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో CM మాట్లాడారు. ఈ వినూత్న విధానం ద్వారా గ్రామ స్థాయిలో భూ వివాదాలను గుర్తించి, దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు.


