News November 20, 2025
పోలి పాడ్యమి కథ వింటే కలిగే ఫలితాలివే..

పోలి పాడ్యమి రోజున నిష్ఠతో దీపారాధన చేసి, పోలి స్వర్గం కథను శ్రద్ధగా వింటే ఈ శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
☞ ఈ ఒక్క రోజు పూజతో కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం సిద్ధిస్తుంది. ☞ స్వర్గ ప్రాప్తి మార్గం సుగమం అవుతుంది. ☞ మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతాయి. ☞ కుటుంబంలో సౌఖ్యం, సమృద్ధి పెరిగి, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ☞ భక్తి, శ్రద్ధల మూలంగా ఈ గొప్ప ఫలాలు అందడం మన అదృష్టం.
Similar News
News March 20, 2026
NLG: బడ్జెట్‌పైనే ‘ఆసరా’ ఆశలు.. పెన్షన్ పెరుగుతుందా?

ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉమ్మడి జిల్లాలోని 4,79,448 మంది పెన్షన్ లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పెన్షన్ల పెంపుపై నేడు స్పష్టత వస్తుందని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పెంచితే NLG-2,15,972 మంది, SRPT-1,56,077 మంది, BNG-1,07,399 మందికి లబ్ధి కలగనుంది. ఫింఛన్లు పెంచుతామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
News March 20, 2026
నేడు తిరుమలకు చంద్రబాబు, లోకేశ్

AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. రేపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా వేంకటేశ్వరుడి ఆశీస్సులు తీసుకోనున్నారు. మంత్రి కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి రేణిగుంట, అక్కడి నుంచి తిరుమలకు చేరుకోనున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో తిరుపతి చేరుకొని అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటారు.
News March 20, 2026
4 విడతల్లో 41 నోటిఫికేషన్లు!

AP: రాష్ట్ర ప్రభుత్వం నిన్న <<19422391>>జాబ్ క్యాలెండర్<<>> రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోనే 10,060 పోస్టులు భర్తీ చేస్తామంది. ఇందుకోసం 4 విడతల్లో విభాగాల వారీగా 41 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా DSC-2,535, కానిస్టేబుల్-1,970, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్-1,500, గ్రూప్2-750, AEE-503, SI-418, ఎక్సైజ్ కానిస్టేబుల్-400, ప్లానింగ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్-251 ఖాళీలు ఉన్నాయి.


