News November 20, 2025

సింగపూర్‌కి ప్రభుత్వ టీచర్లు పయనం.. ఏం చేయబోతున్నారంటే.?

image

సింగపూర్ విద్యా వ్యవస్థను అధ్యయనం చేసేందుకు APకి చెందిన 78 మంది ఉత్తమ ఉపాధ్యాయుల బృందం సిద్ధమైంది. వీరు NOV 27-DEC 2 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, బోధనా పద్ధతులను వీరు పరిశీలిస్తారు. అనంతరం రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు వీరు తమ అభిప్రాయాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఈ బృందం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి పయనం కానుంది.

Similar News

News November 20, 2025

ములుగు: అంబేడ్కరా.. చలి నుంచి రక్షించు!

image

ములుగు జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. అటవీ ప్రాంతంలో చలి తీవ్రత పెరగడంతో మనుషులతో పాటు జంతువులు విలవిల్లాడుతున్నాయి. ఈ క్రమంలో ఏటూరునాగారంలోని అంబేడ్కర్ విగ్రహం ముందు ఓ కోతుల గుంపు కూర్చొని చలికి వణుకుతోంది. ‘అంబేడ్కరా.. చలి నుంచి మమ్మల్ని కాపాడు’ అని విగ్రహం వద్ద కూర్చొని వేడుకున్నట్లు ఉన్న ఈ దృశ్యాన్ని పలువురు తమ సెల్ ఫోన్లలో బంధించారు.

News November 20, 2025

నాగర్‌కర్నూల్‌లో పెరిగిన చలి

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెల్దండ మండలం బొల్లంపల్లిలో 12.0°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్‌లో 12.3°C, బిజినేపల్లిలో 12.4°C చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో అధిక చలి కారణంగా జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

News November 20, 2025

కరీంనగర్: సన్న వడ్లకు బోనస్ ఇస్తారా? ఇవ్వరా?

image

సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయడంలో మాత్రం జాప్యం చేస్తోంది.ఉమ్మడి జిల్లాలో గత యాసంగిలో 20,529 మంది రైతులు పండించిన 1,24,884 క్వింటాళ్ల సన్నాలకు రూ.60.24 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదు. కాగా ఇప్పటికే ఖరీఫ్ కొనుగోళ్లు 60% పూర్తయ్యాయి. వీటికి ఏ ప్రాతిపదికన చెల్లిస్తారో స్పష్టత లేదు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వంపై బోనస్ ప్రభావం పడే ఛాన్సుంది.