News November 20, 2025

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత.!

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. దీంతో పలుచోట్ల మంచు ప్రభావంతో చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభం కాకముందే చలి అధికంగా ఉండడంతో డిసెంబర్ నెలలో మరింత ఎక్కువ చలి ప్రభావం ఉంటుందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, స్థానికులు అవసరం అయితే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దన్నారు.

Similar News

News April 3, 2026

కురిచేడు: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఒకరి స్పాట్ డెత్

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన కురిచేడు మండలం పెద్దవరం గ్రామ సమీపంలో జరిగింది. పెద్దవరం గ్రామంలో నలుగురు వ్యక్తులు కారులో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న అడవిపందిని తప్పించబోయి కారు వాగులో బోల్తా కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

News April 3, 2026

ప్రకాశం: ఫొన్ సిగ్నల్స్ ద్వారా ఒకరిని కాపాడిన పోలీసులు

image

కందుకూరుకు చెందిన గుంటూరి మాధవరావుకు రవీంద్ర నుంచి కొంత డబ్బు రావాల్సి ఉండగా నగదు ఇవ్వాలని అడగగా రవీంద్ర స్పందించలేదు. దీంతో మనస్తాపం చెంది చనిపోతానని ఓ వీడియో బంధువులకు పంపాడు. వారు పోలీస్ కమాండ్ కంట్రోల్‌కి సమాచారం ఇచ్చారు. CI హజరత్తయ్య వెంటనే స్పందించి మాధవరావును ఫోన్‌సిగ్నల్ ఆధారంగా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో గుర్తించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు.

News April 3, 2026

టంగుటూరు: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

image

కందుకూరుకు చెందిన గుంటూరి మాధవరావుకు రవీంద్ర నుంచి కొంత డబ్బు రావాల్సి ఉండగా నగదు ఇవ్వాలని అడగగా రవీంద్ర స్పందించలేదు. దీంతో మనస్తాపం చెంది చనిపోతానని ఓ వీడియో బంధువులకు పంపాడు. వారు పోలీస్ కమాండ్ కంట్రోల్‌కి సమాచారం ఇచ్చారు. స్పందించిన CI హజరత్తయ్య వెంటనే స్పందించి మాధవరావును ఫోన్‌సిగ్నల్ ఆధారంగా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో గుర్తించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులు కప్పగించారు.