News April 15, 2024
KNR: ‘ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

ఈనెల 25నుంచి మే 2వరకు జరుగనున్న ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సోమవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా సాగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లు అనుమతించొద్దన్నారు.
Similar News
News April 24, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మూడురోజుల పాటు RED ALERT

KNR, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజులపాటు తీవ్ర వడగాలులతోపాటు ఉక్కపోత ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు సూచన చేస్తున్నారు. మే నెలలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
News April 23, 2025
చొప్పదండి: మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: కలెక్టర్

ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందని, స్త్రీలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. చొప్పదండిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పోషణ పక్షం కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలని కోరారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో టెస్టులు చేయించుకోవాలని.. తద్వారా రుగ్మతలు నివారించుకోవచ్చన్నారు.
News April 23, 2025
కరీంనగర్ జిల్లాలో మండుతున్న ఎండలు

కరీంనగర్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటల తరువాత ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర, మానకొండూర్ మండలాల్లో 44.0°C నమోదు కాగా, కొత్తపల్లి, చొప్పదండి 43.8, కరీంనగర్, జమ్మికుంట 43.7, శంకరపట్నం 43.6, రామడుగు, ఇల్లందకుంట, తిమ్మాపూర్ 43.5, వీణవంక 43.4, గన్నేరువరం, కరీంనగర్ రూరల్ 43.3, చిగురుమామిడి 43.1, సైదాపూర్ 42.8, హుజూరాబాద్ 42.2°C గా నమోదైంది.